Home Sports_News ఆసియా క్రీడల ఈక్వేషన్ ఇండియా-పాక్ మ్యాచ్ సాధ్యమేనా?

ఆసియా క్రీడల ఈక్వేషన్ ఇండియా-పాక్ మ్యాచ్ సాధ్యమేనా?


ఆ యాంగిల్‌లో తప్పదంటున్న ఎక్స్‌పర్ట్స్.

2026 ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 17 నుంచి మహిళల, 24 నుంచి పురుషుల టీ20 పోటీలు జపాన్‌లో జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లకు పూర్తి అంతర్జాతీయ హోదా ఉంటుంది. 2023లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత్ పురుషులు, మహిళల జట్లు ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి.
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. దీంతో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ లీగ్ లేదా క్వార్టర్ ఫైనల్లో జరగదు. రెండు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు చేరితే మాత్రమే ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. పురుషుల జట్టుకు శ్రేయస్ అయ్యర్, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

 

#IndiaVsPakistan #AsianGames2026 #AsianGamesCricket #TeamIndia #PakistanCricket #ShreyasIyer #HarmanpreetKaur #T20Cricket #CricketNews #Japan2026