Home Crime_News పోలీసులం అంటూ దందా.. ముఠా అరెస్ట్

పోలీసులం అంటూ దందా.. ముఠా అరెస్ట్

47

మార్కాపురం జిల్లా పామూరు హైవేపై పోలీసులమంటూ తుపాకులతో బెదిరించి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 12న పామూరులోని నెల్లూరు రోడ్డు జంక్షన్ సమీపంలో లారీలను ఆపి, అధిక లోడింగ్‌, నకిలీ పత్రాల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ దుర్గాసి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ వినోద్ కుమార్ తెలిపారు.

 

#Markapuram #PamuruHighway #FakePoliceGang #HighwayCrime #ExtortionRacket #PoliceAction #MarkapuramPolice #Pamuru #GunThreat #IllegalCollections #CrimeNews #AndhraPradesh #LorryDrivers #VehicleChecks #FakeOfficials #PoliceInvestigation #CIDurgaSiVinodKumar #RoadSafety #LawAndOrder #CriminalGang #HighwayPatrol #CrimeAlert #APPolice #BreakingNews #LatestNews #Fraudsters #VehicleOwners #PublicSafety #AndhraNews #PoliceRaid