Home AP బజార్లో డాక్ట’రేట్లు’

బజార్లో డాక్ట’రేట్లు’

అనర్హులకు పట్టా ప్రదానం..
దాని వెనుకుందో పకడ్బందీ యాపారం..!
డబ్బుంటే చాలు.. డాక్టర్‌ పట్టా చేతిలో!

ఒకప్పుడు డాక్టరేట్‌ అందుకోవాలంటే ఏళ్ల తరబడి పరిశోధన చేయాలి. ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి. అపారమైన విజ్ఞానం, అంకితభావం, నిరంతర శ్రమకు గుర్తింపుగా మాత్రమే ఆ గౌరవం దక్కేది. కానీ ఇప్పుడు సీన్‌ మారింది! పరిశోధనతో పనిలేదు.. ప్రతిభతో అవసరం లేదు.. పేరున్న విశ్వవిద్యాలయం కోసం వెతకాల్సిన పనీ లేదు! జేబులో డబ్బులుంటే చాలు.. గౌన్‌ వేసి, వేదికపైకి పిలిచి, చేతిలో సర్టిఫికెట్‌ పెట్టి, పేరుకు ముందు డాక్టర్‌ అనే బిరుదు తగిలించేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విదేశీ యూనివర్సిటీల పేర్లు.. అంతర్జాతీయ సంస్థల ముసుగులు.. సోషల్‌ మీడియా ప్రకటనలు.. కమీషన్‌ ఏజెంట్లు.. వెరసి డాక్టరేట్ల చుట్టూ భారీ వ్యాపారం సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చదవడం, రాయడం కూడా సరిగా రాని కొందరు డాక్టర్లుగా చెలామణి అవుతుంటే, ఏళ్ల తరబడి పరిశోధన చేసిన అసలైన విద్యావంతుల పరిస్థితి ఏమిటి? యూజీసీ గుర్తించిన 32 నకిలీ విశ్వవిద్యాలయాల వ్యవహారం.. పీహెచ్‌డీ విక్రయాలపై ఫిర్యాదులు.. వివిధ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న మోసాలు ఈ దందా తీవ్రతను బయటపెడుతున్నాయి. అసలు డాక్టరేట్‌ ప్రదానం చేసే అధికారం ఎవరికి ఉంది? గౌరవ బిరుదు పేరుతో జరుగుతున్న వ్యాపారం వెనుక ఎవరున్నారు? నిజమైన ప్రతిభకు విలువ లేకుండా పోతోందా? బిరుదులు కొనుక్కోవచ్చు.. కానీ ప్రతిభను కొనగలరా?

 

#FakeDoctorate #FakePhD #DoctorateScam #FakeUniversities #UGC #PhDFraud #HonoraryDoctorate #EducationScam #HigherEducation #AcademicFraud #UniversityAccreditation #ResearchIntegrity