Home General 13.07.2026 సోమవారం రాశి ఫలితాలు

13.07.2026 సోమవారం రాశి ఫలితాలు

Daily Horoscope July 13, 2026

21

శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహ సరస్వతీ నమః శ్రీ గురుభ్యోనమః 13.07.2026 సోమవారం రాశి ఫలితాలు

మేష రాశి : ప్రభుత్వ సంబంధ కార్యకలాపకాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులతో పరిచయాలు లాభిస్తాయి. వాక్చాతుర్యంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక సద్దుబాటులకు ఆస్కారం ఉంది. చిరు వ్యాపారస్తులకు అనుకూలం. నగర స్థాయి నాయకులకు ప్రజాదరణ ఉండును. స్త్రీలు ఓర్పును పెంచుకోగలరు.

వృషభ రాశి : మీ సమీపంలో ఉన్న పెద్దలను కలవటం మధురస్మృతిగా ఉండును. కొంచెం ఖర్చు పెరిగిన ఆర్థిక పుష్టిని కలిగి ఉంటారు. పుణ్యక్షేత్ర దర్శనముకు ఆస్కారం ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలము. అప్పుచేసి ఆస్తికనుగోలు చేసేందుకు శు దినము. లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

మిధున రాశి: ఇతరులను ఆకర్షించే విధంగా ప్రవర్తిస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే ఆస్కారం ఉంది. ఆర్థిక పుష్టిని కలిగి ఉంటారు. కళా రంగం వారికి అనుకూలం. విదేశ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వీసా వస్తుంది. ఉద్యోగస్తులు పని ఒత్తిడి ఉన్నా సరదాగా ఒత్తిడిని తెలియకుండా గడుపుతారు. ప్రేమికులు సంతోషంగా గడుపుతారు. పోటీ పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యమే. ఉపాధ్యాయులకు మంచి పేరు వచ్చే రోజు. సూర్య నమస్కారం చెప్పదగు సూచన.

కర్కాటక రాశి: మిమ్మలను తక్కువగా చేసి మాట్లాడే వారిని మీరు గమనించిన వారితో వివాదాలకు పోవద్దు. షేర్ మార్కెట్ నందు నష్టపోయే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. కోర్టు తీర్పు వ్యతిరేకం. ఖర్చులు పెరగటం గమనిస్తారు. నిరుద్యోగులు తమకు వచ్చిన అవకాశాన్ని చేయిజార్చుకునే పరిస్థితి ఉండును. కుటుంబ సౌఖ్యం తగ్గును. స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేసుకోవటం మంచిది. అపరాజిత స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన గ్రహదోష తీవ్రతను తగ్గించును.

సింహరాశి: ప్రజాజీవనంలో ఉండేవారు ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకుంటారు. పాడి పరిశ్రమకు అనుకూలం. గృహిణులు సంతోషంగా గడుపుతారు. ఎంత కష్టతరమైన పనినైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు వినోద కార్యక్రమాలలో సంతోషంగా గడుపుతారు. కాల భైరవాష్టక పారాయణ మేలు చేస్తుంది.

కన్యా రాశి : సినీ, టీవీ రంగాలలో ఉన్న వారికి కలిసి వచ్చే రోజు. ఉద్యోగస్తులకు అనుకూలం. షేర్ మార్కెట్ మీకు అనుకూలంగా ఉండును. ఉద్యోగస్తులకు మెండైన రోజే. వ్యాపారస్తులకు రాని బాకీలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. విదేశ విద్య అభ్యసించాలనుకునే వారికి వీసా వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి సామాన్యం. కుటుంబ సౌఖ్యం కలుగును. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ మేలు చేస్తుంది.

తులారాశి : ఉద్యోగస్తులు తమరి పనిని తాము సక్రమంగా చేసుకోలేని పరిస్థితి ఏర్పడును. రహస్య శత్రువులను గమనించండి వాదనకు వెళ్ళవద్దు సుమా! ఎప్పుడు మంచి రోజులు వస్తాయా అనే భావన మీ మనసులో కలుగుతుంది. ఆర్థిక సంబంధ అవకాశాలను చేయజార్చుకుంటారు. మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించగలరు. స్త్రీలు ఆడపడుచుతో సఖ్యత పెంచుకోవాలి. ఆపదుద్ధారక స్తోత్రం పారాయన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి : ఎవరితోనూ వాదన పెట్టుకోవద్దు ఆర్థిక నష్టాలు కలిగే వాటి జోలికి పోవద్దు. డ్రైవింగ్ నిదానంగా చేయాలి. అనుకున్న లక్ష్యాలు సాధించటం కష్టంగా ఉంటుంది. ప్రగల్బాలకు పోవద్దు. దాంపత్య జీవనం పై ప్రతికూల ప్రభావం పడకుండా తగు జాగ్రత్త తీసుకోగలరు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోగలరు. దుర్గా దేవి దర్శనం,అష్టోత్తర పారాయణ మేలు చేస్తాయి.

ధనస్సు రాశి : మొండిబాకిలను పట్టుదలతో వసూలు చేస్తారు. ప్రజా జీవనంలో ఉండే వారికి ప్రజాదరణ ఆనందాన్నిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం లాబిస్తుంది. ప్రేమికులు ఆనందంగా గడుపుతారు. సాయంత్రం శివాలయ దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి : శ్రమించే తత్వం పెరుగును. మీ నిజాయితీని పెద్దలు గుర్తిస్తారు. మిమ్మల్ని మీరు ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకుంటారు. కృషికి తగిన ఆదాయం వస్తుంది. హున విద్యలకు అనుకూలం. తొందరపడి మాట్లాడకండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న టీం లీడర్… సమర్థత అధికారుల దృష్టికి వెళుతుంది. జమ్మి చెట్టు ప్రదక్షణ శత్రువులను నిరోధిస్తుంది. పెరుగన్నం దానం చేయటం వలన గ్రహదోష తీవ్రత తగ్గును.

కుంభరాశి : మిత్రుల సహకారము ను తీసుకుంటూ అందర్నీ కలుపుకుపోవాలి. డ్రైవింగ్ స్పీడ్ తగ్గించుకోవాలి. ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిన ఆత్మవిశ్వాసం కోల్పోకు సుమా! దైవ శక్తి పెంచుకోగలరు. భార్య సహకారం మేలు చేస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యం. ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ గ్రహదోష తీవ్రతను తగ్గించగలదు. దానిమ్మ మొక్కను నాటి సంరక్షించండి.

మీన రాశి : నూతన పరిచయాలు చేటు చేయవచ్చు. పైపై మెరుగులు చూసి మోసపోవద్దు సుమా! ప్రతి చిన్న విషయానికి వివాదాలకు పోవద్దు. తొందరపాటు తగ్గించుకొని వివరంగా తెలియచేస్తే సరిపోతుంది కదా అండి. భార్యతో గొడవ పడకుండా ఉంటే కుటుంబ సౌఖ్యాని కి ఆస్కారం ఉంది. తల్లిదండ్రుల ఆశీస్సులు గ్రహదోషతీవ్రతం తగ్గించగలదు. అపరాజిత స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.


టీటీడీ అనుబంధ సంస్థ సమరసత సిద్ధాంతి ‘ దైవజ్ఞ ‘ పులిపాక చంద్రశేఖర శర్మ శ్రీ చక్ర పంచాంగ కర్త 9440783005.