Home AP వేటుకు వేళాయె..! మంత్రులకు “స్థానిక” గండం..

వేటుకు వేళాయె..! మంత్రులకు “స్థానిక” గండం..

ఫలితాలు అమాత్యులకు రిఫరెండం.
బాబు వద్ద సిద్ధమైన ఊస్టింగ్ లిస్ట్.
సీమ మంత్రుల పేర్లే సెండాఫ్‌లో ఫస్ట్.

అమరావతి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. నవంబర్ 10న జరగనున్న చంద్రబాబు కేబినెట్ సమావేశం సాధారణ భేటీనా? లేక కొందరు మంత్రుల రాజకీయ భవిష్యత్తును తేల్చే కీలక మలుపా? రెండేళ్ల పాలన తర్వాత మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి అసలు లెక్కలు తీస్తున్నారన్న ప్రచారం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. రాయలసీమ మంత్రుల్లో ఎవరికి పదవీ గండం? బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్. సవితలకు ఎదురవుతున్న సవాళ్లేమిటి? స్థానిక ఎన్నికల్లో 44కు 44 వార్డులు ఏకగ్రీవం చేయించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి జిల్లా కేంద్రం వివాదం రాజకీయ చిక్కులు తెస్తుందా? టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్‌ల భవితవ్యం ఏమిటి? ఇద్దరు ముగ్గురికి ఉద్వాసన పలికి, కొత్తవారికి పట్టం కడతారా? జనసేన, బీజేపీ వాటాల లెక్కలు ఎలా తేలుస్తారు? మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం దక్కనుంది? నామినేటెడ్ పదవుల పంపిణీతో పాటు 2029 ఎన్నికల వ్యూహానికి చంద్రబాబు ఇప్పుడే పదును పెడుతున్నారా? కొనసాగింపా.. ఉద్వాసనా.. శాఖల మార్పా? ఈసారి చంద్రబాబు వేయబోయే ఒక్క రాజకీయ అడుగు కూటమి భవిష్యత్తునే మార్చబోతోందా? తెర వెనుక జరుగుతున్న అసలు కసరత్తుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది!

 

#ChandrababuNaidu #APCabinetReshuffle #AndhraPradeshPolitics #APMinisters #CabinetMeeting #RayalaseemaPolitics #BCJanardhanReddy #SSavitha #MandipalliRamprasadReddy #TGBharath #SatyakumarYadav #TDPAlliance #JanaSena #BJP