Home AP నా వ్యాఖ్యలు మహిళలకు వ్యతిరేకం కాదు – ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గుడివాడ అమర్...

నా వ్యాఖ్యలు మహిళలకు వ్యతిరేకం కాదు – ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

33

తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో వైసిపి నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ యావత్ మహిళా లోకానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు. కేవలం ఒక వ్యక్తి సంస్కార హీనంగా, పద్ధతి లేకుండా మాట్లాడిన మాటలను మాత్రమే తాను ఖండించానని వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో కొందరు నేతలు పౌర సమాజం హర్షించని విధంగా మాట్లాడుతున్నారని, దానికి బదులుగానే తాను స్పందించాల్సి వచ్చిందని అమర్‌నాథ్ పేర్కొన్నారు. తన మాటలను కొందరు కావాలనే తప్పుగా చిత్రీకరిస్తూ మహిళలను అవమానించినట్లు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.