Home General ఐపీఎస్ విశాల్ గున్ని సస్పెన్షన్ పొడిగింపు

ఐపీఎస్ విశాల్ గున్ని సస్పెన్షన్ పొడిగింపు

5

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు, గత ప్రభుత్వ హయాంలోని వివాదాస్పద పరిణామాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది సెప్టెంబర్ 4, 2026 వరకు లేదా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12, 2026న సమావేశమైన ఉన్నత స్థాయి సమీక్షా కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విశాల్ గున్ని పోలీస్ శాఖలో ఉన్నత పదవిలో ఉన్నందున, ప్రస్తుత తరుణంలో సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆయన తిరిగి విధుల్లోకి చేరితే క్రిమినల్ కేసు దర్యాప్తు సజావుగా సాగకపోవచ్చని పేర్కొంది. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనల ప్రకారం కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు వీలుగా సస్పెన్షన్ పొడిగింపునకే మొగ్గు చూపింది.

 

#KadambariJethwaniCase #VishalGunni #IPSOfficer #AndhraPradesh #APGovernment #SuspensionExtended #PoliceOfficer #CriminalInvestigation #IbrahimpatnamPolice #LegalCase #GovernmentOrder #ChiefSecretary #Investigation #LawAndOrder #AdministrativeAction #IPS #PoliceDepartment #AndhraNews #PoliticalNews #CourtCase #HighLevelCommittee #SuspensionOrder #CrimeNews #BreakingNews #LatestNews #APPolitics #OfficialInquiry #Governance #PublicAdministration #NewsUpdate