Home National_news “వోట్ చోరీ”పై బీజేపీ ఎదురుదాడి

“వోట్ చోరీ”పై బీజేపీ ఎదురుదాడి

యాంటీ ఇన్‌కంబెన్సీపై ప్రశ్నలు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ “వోట్ చోరీ” ఆరోపణలకు బీజేపీ గట్టి సమాధానం ఇచ్చింది. ఢిల్లీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది స్పందించారు. పలు రాష్ట్రాల్లో యాంటీ ఇన్‌కంబెన్సీ కనిపించకుండా పోయిందన్న రాహుల్ వాదనకు చారిత్రక ఆధారాలు లేవని ఆయన అన్నారు. తమిళనాడులో 1967 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, పశ్చిమ బెంగాల్‌లో 1977 తర్వాత, బీహార్‌లో 1990 తర్వాత, ఉత్తరప్రదేశ్‌లో 1989 తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేదని గుర్తుచేశారు. ఒడిశాలో 1999 తర్వాత కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉందని తెలిపారు. ఈ వివరాలను ఆధారంగా చేసుకుని రాహుల్ వాదనను త్రివేది ప్రశ్నించారు.

సర్ వివాదంపై ఈసీ స్పష్టీకరణ

ఈ రాజకీయ ఘర్షణకు కేంద్రంగా సర్ ఓటర్ల జాబితా సవరణ వ్యవహారం నిలిచింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సార్లు పలు నిర్ణయాలపై అభ్యంతరాలు నమోదు చేశారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఫామ్-6 మార్పులు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఓటర్ల డేటాబేస్‌ను కేంద్రీకరించడంపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తినట్లు నివేదిక పేర్కొంది.

 

#BJP #RahulGandhi #SudhanshuTrivedi #VoteChori #AntiIncumbency #SIR #ElectionCommission #GyaneshKumar #SukhbirSinghSandhu #VivekJoshi #VoterList #Form6 #Congress #BJPvsCongress #ElectionNews