Home AP ఎంపీ సీట్ల పెంపుపై క్లారిటీ

ఎంపీ సీట్ల పెంపుపై క్లారిటీ

అసెంబ్లీ సీట్లపై లభించని షూరిటీ.
తెలంగాణ, ఏపీ ఎమ్మెల్యే సీట్లపైనే చర్చ.
చేయాల్సిందేనంటూ నేతల రచ్చ .
బిల్లు ఆమోదంపై ఎన్డీఏ దీమా.
డీఎంకే వైఖరితో కాంగ్రెస్ డైలమా.

ఏపీకి అటెన్షన్.. తెలంగాణకూ టెన్షన్! లోక్‌సభ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇస్తున్నా.. అసెంబ్లీ స్థానాల పెంపుపై మాత్రం ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. డీలిమిటేషన్ బిల్లు చుట్టూ ఢిల్లీలో రాజకీయ చదరంగం మొదలైంది. 50 శాతం లోక్‌సభ స్థానాల పెంపు ప్రతిపాదనతో కేంద్రం ముందడుగు వేస్తుంటే.. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే స్థానాలు కూడా పెరుగుతాయా? పెరిగితే ఎన్ని పెరుగుతాయి? ఏపీ పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాల పెంపుపై ఉన్న ఆశలకు ఈ బిల్లు ఊపిరి పోస్తుందా? తెలంగాణలోనూ కొత్త నియోజకవర్గాల రాజకీయ లెక్కలు మారతాయా? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్! మరోవైపు డీఎంకే షరతులు.. రాహుల్ గాంధీ వ్యతిరేకత.. ఎన్డీఏ మెజారిటీ ధీమా.. పార్లమెంట్‌లో కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నాయి. ఏప్రిల్‌లో ఓడిన బిల్లు ఇప్పుడు గట్టెక్కుతుందా? ఎంపీ సీట్ల పెంపుతోనే సరిపెడతారా? ఎమ్మెల్యే సీట్లపైనా స్పష్టత ఇస్తారా? నవంబర్ 30 నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై రెండు తెలుగు రాష్ట్రాల చూపు! అసలు ఏ నిమిషానికి ఏమి జరుగునో!?

 

#Delimitation #DelimitationBill #AndhraPradesh #Telangana #APAssemblySeats #TelanganaAssembly #LokSabha #NDA #DMK #RahulGandhi #Parliament #PoliticalNews #TeluguStates