Home AP పట్టిసీమతో రైతులకు ఊపిరి.. జగన్‌పై నిమ్మల ఫైర్‌!

పట్టిసీమతో రైతులకు ఊపిరి.. జగన్‌పై నిమ్మల ఫైర్‌!

‘వట్టిసీమ’ అన్నావ్‌.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతావ్‌?

పట్టిసీమ ప్రాజెక్టుపై గతంలో విమర్శలు చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో పట్టిసీమను ‘వట్టిసీమ’గా అభివర్ణించడంతో పాటు, ఈ ప్రాజెక్టుకు పెట్టే ఖర్చు వృథా అని జగన్‌ అన్నారని గుర్తుచేశారు. అధికారంలోకి వస్తే పట్టిసీమ పంపులు పీకేస్తానని అసెంబ్లీలో ప్రకటించారని విమర్శించారు. రైతులకు మేలు చేస్తున్న ప్రాజెక్టును వ్యతిరేకించినందుకు జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పినా రాష్ట్ర రైతాంగం ఆయనను క్షమించదని వ్యాఖ్యానించారు.

500 టీఎంసీల నీరు.. రూ.50 వేల కోట్ల సంపద!

పట్టిసీమ ద్వారా రాష్ట్రానికి 500 టీఎంసీల నీరు అందిందని, కృష్ణా డెల్టాకు 57 టీఎంసీల నీటిని అందించడం ద్వారా రూ.50 వేల కోట్ల సంపద సృష్టించిందని నిమ్మల పేర్కొన్నారు. ఈ నీటి సరఫరా రాయలసీమకు కూడా ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు. రైతాంగానికి ఉపయోగపడుతున్న ప్రాజెక్టును గతంలో వృథా ప్రయాసగా చిత్రీకరించారని జగన్‌పై మండిపడ్డారు. పట్టిసీమ వల్ల కలిగిన ప్రయోజనాలపై రాష్ట్ర రైతులకు జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించాలని నిమ్మల స్పష్టం చేశారు. పట్టిసీమపై జగన్‌ గతంలో చేసిన విమర్శలకు ప్రస్తుత ప్రయోజనాలే సమాధానమని మంత్రి వ్యాఖ్యానించారు.

 

#PattiseemaProject #NimmalaRamanaidu #YSJaganMohanReddy #AndhraPradesh #IrrigationProject #KrishnaDelta #Rayalaseema #APFarmers #WaterResources #PattiseemaControversy #AgricultureNews #APPolitics #AndhraPradeshNews