విస్తరణలో పాతకాపుకు గోల్డెన్ ఛాన్స్!
రాజకీయాల్లో అదృష్టం ఎప్పుడు ఎవరిని తలుపుతడుతుందో చెప్పడం కష్టం. పదవి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నేతకు ఒక్కసారిగా మారిన సమీకరణాలు గోల్డెన్ ఛాన్స్ తెచ్చిపెడతాయి. ఇప్పుడు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు తెలంగాణ కాంగ్రెస్‌లో ఇదే కోణంలో చర్చకు వస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు 2023లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపు కీలక మలుపైంది. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీలో తన ప్రాధాన్యత పెంచుకున్నారు. తాజాగా కొండా సురేఖ చుట్టూ నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గంలో ఖాళీ ఏర్పడితే, ఆ స్థానానికి ఆది శ్రీనివాస్‌ను పరిశీలించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం, సీనియారిటీ, ఎమ్మెల్యేగా గెలుపు, ప్రభుత్వ విప్‌గా అనుభవం ఆయనకు అనుకూలంగా మారవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోనే ఉంది.
#AadiSrinivas #AadiSrinivasMinister #VemulawadaMLA #GovernmentWhip #KondaSurekha #KondaSurekhaExit #TelanganaCabinet #CabinetExpansion #TelanganaCongress #RevanthReddy #RevanthReddyCabinet #TelanganaPolitics #CongressHighCommand #MunnuruKapu #TelanganaMinisters #CabinetReshuffle #Vemulawada #TelanganaNews











