Home Telangana కౌసల్య కాలనీలో ఘనంగా గణేశ నిమజ్జనం

కౌసల్య కాలనీలో ఘనంగా గణేశ నిమజ్జనం

Grand Ganesh Immersion Celebrations Held in Bachupally

హైదరాబాద్‌ బాచుపల్లిలోని కౌసల్య కాలనీలో గణేశ నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 8 వేల మందికి ఉచితంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నవరాత్రుల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను సైతం వైభవంగా నిర్వహించి భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపారు. సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త అమరావది శేషయ్య ప్రవచనం అందించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయనను సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు లగ్గాప్రగడ ప్రసాద్‌రావు, పార్థసారథి ఘనంగా సన్మానించారు. భక్తి, సేవ, సంస్కృతి సమ్మేళనంగా సాగిన ఈ కార్యక్రమం కౌసల్య కాలనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.