Home Telangana ఖైరతాబాద్‌లో ఖేల్ ఖతం

ఖైరతాబాద్‌లో ఖేల్ ఖతం

ఉన్నది కాస్తా.. ఊడింది.. ‘సుప్రీం’ మంగళం పాడింది!

ఖైరతాబాద్ రాజకీయాల్లో ఒక్క తీర్పుతో కథ మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్ టికెట్‌పై 2023లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హతను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన కారణం లేదని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారి ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. న్యాయపోరాటం ముగిసిన చోటే అసలు రాజకీయ పోరు మొదలుకానుంది. కాంగ్రెస్ మళ్లీ దానానికే అవకాశం ఇస్తుందా? బీఆర్‌ఎస్ పాత సీటును తిరిగి దక్కించుకునేందుకు ఎవరిని బరిలోకి దింపుతుంది? బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమని దానం ప్రకటించడంతో ఖైరతాబాద్‌లో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి. ఒకవైపు పదో షెడ్యూల్‌పై సుప్రీం తీర్పు.. మరోవైపు ప్రజల తీర్పు కోసం సిద్ధమవుతున్న దానం. ఎమ్మెల్యే పదవి కోల్పోయిన నేతకు ఇదే నియోజకవర్గం నుంచి తిరిగి ప్రజల ముందుకు వెళ్లే అవకాశం ఇప్పుడు ఎదురైంది. కోర్టులో ముగిసిన ఈ అధ్యాయం.. ఖైరతాబాద్ ఓటర్ల మధ్య ఎలాంటి కొత్త రాజకీయ కథను రాయబోతోంది?

 

#DanamNagender #Khairatabad #KhairatabadByElection #SupremeCourt #TelanganaHighCourt #MLADisqualification #AntiDefectionLaw #TenthSchedule #Congress #BRS #TelanganaPolitics #DanamNagenderVerdict #TelanganaBypoll #KhairatabadPolitics #PoliticalNews