Home AP ఇప్పటం రోడ్డులో వినాయకునికి 125 ప్రసాదాలు

ఇప్పటం రోడ్డులో వినాయకునికి 125 ప్రసాదాలు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ధనుంజయకు సత్కారం

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆత్మకూరులో ఇప్పటం రోడ్డు నాలుగవ లైన్ లో శ్రీ విజయ దుర్గా చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం పక్కన శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి 125 ప్రసాదాలు సమర్పించారు. స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదాలు ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ, భార్య విజయకుమారి దంపతులు, హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ వారు ధనుంజయ దంపతులను, మంగళగిరి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ తాతా కోటయ్య, స్థానిక ప్రముఖులు జయచంద్ర, వేణు గోపాలకృష్ణలను శాలువాతో సత్కరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కమిటీ వారు పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు.

 

#IppatamRoad #Mangalagiri #LordGanesha #GaneshCelebrations #GaneshFestival #125Prasadam #LakshmiGanapathi #Dhanunjaya #GuttikondaDhanunjaya #Vijayakumari #Atmakur #TDP #MangalagiriNews #GaneshPuja #AndhraPradesh