Home AP ఏ4 షాపుల రెన్యువల్‌కు భారీ స్పందన

ఏ4 షాపుల రెన్యువల్‌కు భారీ స్పందన

రూ.403 కోట్లకు చేరిన వసూళ్లు.
1,970 షాపుల నుంచి దరఖాస్తులు.

ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఏ4 మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యువల్‌ ప్రక్రియకు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 3,652 ఏ4 షాపుల్లో ఇప్పటివరకు 1,970 షాపులు రెన్యువల్‌కు ముందుకొచ్చాయి. వీటిలో 686 షాపులు పూర్తి చెల్లింపులు చేయగా, మరో 534 షాపులు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. మొత్తంగా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్న షాపుల్లో 61.9 శాతం ఇప్పటికే చెల్లింపులు పూర్తి చేశాయి. ఇప్పటివరకు రెన్యువల్‌ సహా సంబంధిత ఛార్జీల రూపంలో రూ.403.25 కోట్ల ఆదాయం సమకూరింది. సెప్టెంబర్‌ 21 తుది గడువు కావడంతో మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

జిల్లాల్లో భిన్నంగా చెల్లింపులు

రెన్యువల్‌కు ముందుకొచ్చిన షాపుల్లో చెల్లింపుల పరంగా పలు జిల్లాలు ముందంజలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెన్యువల్‌కు ఎంపికైన మొత్తం 30 షాపుల నుంచి చెల్లింపులు జరిగాయి. విశాఖపట్నం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 85 శాతం చెల్లింపులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 84 శాతం, తూర్పుగోదావరిలో 77 శాతం, ఏలూరులో 75.5 శాతం, కాకినాడలో 69 శాతం షాపులు చెల్లింపులు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 1,682 షాపులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు, రెన్యువల్‌కు వచ్చిన మరో 750 షాపులు ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపు చేయలేదు. వసూళ్లలో రూ.236.48 కోట్లు రెన్యువల్‌ రెట్, అప్లికేషన్‌ ఫీజు ద్వారా, రూ.145.03 కోట్లు వార్షిక రెట్ ద్వారా, రూ.21.81 కోట్లు పర్మిట్‌ రూమ్‌ రెట్ ద్వారా వచ్చాయి.

#APLiquorShops #A4LiquorShops #LiquorShopRenewal #APExcise #AndhraPradesh #LiquorRevenue #APLiquorPolicy #A4Shops #ShopRenewal #ExciseRevenue #AP2026 #LiquorBusiness #APNews #AndhraPradeshNews #LicenseRenewal