Home AP టాటాల కుంపట్లు పదవి కోసం సిగపట్లు

టాటాల కుంపట్లు పదవి కోసం సిగపట్లు

కుర్చీ కోసం కొత్త పంచాయితీ .
చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్లు.
వద్దనే వద్దంటూ ట్రస్ట్ అభ్యంతరం.

టాటా అంటే కేవలం ఉప్పు కాదు.. కారు కాదు.. సాఫ్ట్‌వేర్ కాదు.. దేశంలో కోట్లాది మంది జీవితాలను ఏదో ఒక రూపంలో తాకిన పేరు టాటా. ఒకరి చేతిలో టాటా ఉప్పు ఉంటే.. మరొకరి ఇంట్లో టాటా స్కై కనెక్షన్ ఉండొచ్చు. ఇంకొకరి ప్రయాణం టాటా కారు మీద సాగుతుండొచ్చు. ఎవరో టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తుండొచ్చు. మరొకరి బ్యాంకింగ్, విమాన ప్రయాణం, హోటల్ బస, పెట్టుబడుల వెనుక టాటా సంస్థ ఉండొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంత లోతుగా పాతుకుపోయిన ఈ దిగ్గజ సంస్థలో ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? నాలుగు దశాబ్దాలుగా టాటాలతోనే ప్రయాణించి అత్యున్నత స్థాయికి చేరిన ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్లు చైర్మన్ పదవి ఇవ్వాలని టాటా సన్స్ బోర్డు నిర్ణయించింది. కానీ.. 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్టులు మాత్రం ఈ నిర్ణయాన్నే చట్టబద్ధం కాదంటున్నాయి. ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటా ఎందుకు వ్యతిరేకించారు? చంద్రశేఖరన్ ఒకసారి తప్పుకోవాలని చెప్పి మళ్లీ ఎలా వచ్చారు? ఇది వ్యక్తుల మధ్య పోరా.. లేక టాటా సామ్రాజ్య భవిష్యత్‌పై సాగుతున్న పెద్ద అంతర్గత సమరమా? అసలు టాటా గ్రూప్ యాజమాన్యం ఎలా పనిచేస్తుంది? సామాన్యుడి జీవితంతో దాని బంధం ఏమిటి? ఈ కథ వెనుక దాగిన అసలు లెక్కలు ఏంటి?

#TataGroup #TataTrusts #NChandrasekaran #NoelTata #TataSons #TataGroupLeadership #TataTrustsOpposition #TataGroupPowerStruggle #TataChairman #IndianBusiness #BusinessNews #TataEmpire #TataSuccession #RatanTata