ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా మరో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎస్ఈసీ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాల మేరకు సెప్టెంబరు 22న ఫారం-1 నోటీసుతో పాటు ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. 2026 జనవరి 1ను అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఈ జాబితాలను రూపొందిస్తున్నారు. వార్డుల పునర్విభజన పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటికే సెప్టెంబరు 3న జాబితాలు విడుదలయ్యాయి.
ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం
మిగిలిన ప్రాంతాల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ సెప్టెంబరు 14 నుంచి 17 మధ్య పూర్తికానుంది. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ విజ్ఞప్తిని పరిశీలించిన ఎస్ఈసీ.. సెప్టెంబరు 22ను ఓటర్ల జాబితా ప్రచురణ తేదీగా ఖరారు చేసింది. తాజా జాబితాల విడుదలతో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వార్డు కౌన్సిలర్ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియకు కూడా మార్గం సుగమం కానుంది. సంబంధిత కమిషనర్లు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను నవంబరు, డిసెంబరులో పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
#APMunicipalElections #APMunicipalElections2026 #AndhraPradeshMunicipalElections #APLocalBodyElections #APLocalElections #APVoterList #MunicipalVoterList #WardWiseVoterList #StateElectionCommission #APSEC #AnilChandraPuneetha #MunicipalCorporations #Municipalities #WardDelimitation #MayorElections #MunicipalChairperson #WardCouncillors #ZPTCElections #MPTCElections #GramPanchayatElections #AndhraPradesh #APPolitics #APElections2026 #APNews #LocalBodyElections











