పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఇమ్రాన్‌తో తాను మాట్లాడలేదని వెల్లడించిన అక్రమ్.. రాజకీయంగా ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంతో బాధాకరమని అన్నారు. అయితే కోర్టు తీర్పులు, న్యాయపరమైన అంశాలపై తాను వ్యాఖ్యానించబోనని, ఇమ్రాన్ ఆరోగ్యం విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. 1992 ప్రపంచకప్ విజేతగా పాకిస్థాన్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ 2022 నుంచి జైలులో ఉన్నారు. పలు అవినీతి కేసుల్లో దోషిగా తేలినప్పటికీ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. 73 ఏళ్ల ఇమ్రాన్‌కు సరైన వైద్యం, మానవీయ పరిస్థితులు కల్పించాలని ఇటీవల 22 మంది మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌కు బహిరంగ లేఖ రాశారు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరోగ్యం కాపాడాలి
ఇమ్రాన్ పరిస్థితులపై ఇంగ్లండ్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా స్పందనలు వస్తున్నాయని వసీం అక్రమ్ తెలిపారు. అయితే పాకిస్థాన్‌లో అలాంటి పరిస్థితి కనిపిస్తుందో లేదో తనకు స్పష్టంగా తెలియదని వ్యాఖ్యానించారు. స్నేహితుడిగా, వ్యక్తిగతంగా ఇమ్రాన్ గురించి తాను ఆందోళన చెందుతున్నానని చెప్పారు. ఆయన దోషిగా తేలినా, జైలులో ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడాల్సిందేనని పేర్కొన్నారు. ప్రభుత్వ వర్గాలు ఇమ్రాన్ ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నప్పటికీ తనకు ఆందోళనగా ఉందని అక్రమ్ అన్నారు. “అతన్ని చాలా మిస్ అవుతున్నాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇమ్రాన్ మాజీ సహచరుడు జావెద్ మియాందాద్ కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన వైద్య చికిత్స అందించాలన్న డిమాండ్ మాజీ క్రికెటర్ల నుంచి పెరుగుతున్న వేళ, వసీం అక్రమ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో మరింత చర్చకు దారితీశాయి.
#WasimAkram #ImranKhan #ImranKhanHealth #WasimAkramEmotional #PakistanCricket #CricketLegends #ImranKhanJail #ImranKhanHealthConcern #WasimAkramImranKhan #1992WorldCup #PakistanCricketLegend #BrianLara #JavedMiandad #ImranKhanMedicalCare #PakistanPolitics #CricketNews #PakistanNews #FormerCaptain #ImranKhanLatest #HealthConcern











