ఇరాన్ బెదిరింపుతో అమెరికాలో టెన్షన్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బ్యారన్ ట్రంప్‌పై ఇరాన్ నుంచి తీవ్ర బెదిరింపు వెలువడినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ఓ వీడియోలో 20 ఏళ్ల బ్యారన్‌ను లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిస్తూ 10 మిలియన్ డాలర్లు, అంటే రూ.95 కోట్లకు పైగా రివార్డు ప్రకటించినట్లు కథనం పేర్కొంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు అనుబంధ మీడియా విడుదల చేసిన ఈ వీడియోలో బ్యారన్ కదలికలను చూపిస్తూ, అతడి భద్రతకు సంబంధించిన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
సీక్రెట్ సర్వీస్ భద్రతపై ఆరోపణలు
వీడియోలో బ్యారన్ సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే విధానంపై వివరాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గతంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్న వీడియోను కూడా ఇరాన్ ప్రసారం చేసినట్లు కథనం తెలిపింది. అందులో బ్యారన్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. మెలానియా, బ్యారన్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ 24 గంటల భద్రత కల్పిస్తోంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత మరింత పెరుగుతుందా?
ఈ బెదిరింపు వీడియో వెలువడిన సమయంలోనే ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి పెంచుతామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ మాత్రం అమెరికా చర్యలను తమ సైనిక వైఫల్యాన్ని అంగీకరించినట్లుగా అభివర్ణించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తత మరింత తీవ్రంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్యారన్‌పై వచ్చిన బెదిరింపులపై అమెరికా భద్రతా వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నట్లు కథనం పేర్కొంది.
#BarronTrump #DonaldTrump #IranThreat #BarronTrumpThreat #BarronTrumpBounty #Iran #USIran #USIranTensions #DonaldTrumpSon #MelaniaTrump #SecretService #IranRevolutionaryGuard #IranStateMedia #TrumpFamily #USSecurity #WhiteHouse #AmericanPolitics #InternationalNews #WorldNews #IranNews #USNews











