Home AP గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు వర్ల రామయ్య, రమాదేవికి ఛాన్స్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు వర్ల రామయ్య, రమాదేవికి ఛాన్స్


రెండు స్థానాలకు అభ్యర్థుల ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బీసీ మహిళా నేత దళవాయి రమాదేవిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సిఫార్సులతో కూడిన దస్త్రాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. దళిత సామాజికవర్గానికి చెందిన వర్ల రామయ్య టీడీపీలో సుదీర్ఘకాలంగా కీలకంగా పనిచేస్తున్నారు. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. మరోవైపు అనంతపురానికి చెందిన వడ్డెర సామాజికవర్గ మహిళా నేత దళవాయి రమాదేవికి అవకాశం కల్పించడం ద్వారా బీసీ సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు టీడీపీ పేర్కొంటోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న రమాదేవి సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పలు బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. గవర్నర్ ఆమోదం తర్వాత ఇద్దరి నియామకాలు అధికారికంగా ఖరారు కానున్నాయి.

 

#VarlaRamaiah #DalavaiRamadevi #MLC #GovernorQuota #APMLC #AndhraPradesh #TDP #TDPNominations #APPolitics #AndhraPradeshPolitics #GovernorQuotaMLC #LegislativeCouncil #VarlaRamaiahMLC #DalavaiRamadeviMLC #BCWomen #BCLeadership #TDPLeaders #APGovernment #PoliticalAppointments #AndhraPradeshNews