Home Telangana అధికార మార్పునకు ఛాన్స్ లేదంటున్న కాంగ్రెస్..

అధికార మార్పునకు ఛాన్స్ లేదంటున్న కాంగ్రెస్..


రేవంత్‌కు సెండ్ ఆఫ్‌పై బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్
మాదే సెకండాఫ్.. కాదు.. మీకు సెండాఫ్

మూడేళ్ల గడప దగ్గర తెలంగాణ రాజకీయాలు గేర్‌ మార్చబోతున్నాయి. కాంగ్రెస్‌ సర్కార్‌కు మరో నాలుగు నెలల్లో మూడేళ్లు పూర్తి. కానీ రేవంత్‌రెడ్డి లెక్కలు మాత్రం 2034 వరకూ వెళ్లిపోయాయి. మళ్లీ అధికారం మాదేనంటూ ధీమా.. సీఎం కుర్చీపై ఇప్పుడే ఆశలు పెట్టుకోవద్దంటూ ప్రత్యర్థులకు సూటి వార్నింగ్‌! హామీలు అమలు చేశాం.. పాలన గాడిలో పెట్టామన్నది కాంగ్రెస్‌ వాదన. కానీ కారు పార్టీ మాత్రం “రేవంత్‌ ఇక చాలు.. వచ్చేది బీఆర్‌ఎస్‌” అంటూ కౌంటర్‌ ఇస్తోంది. మరోసారి సారు సర్కారంటూ క్యాడర్‌లో జోష్‌ నింపుతోంది. ఇదే సమయంలో కాషాయం పార్టీ తెలంగాణపై ఫోకస్‌ పెంచుతోంది. చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌ పూర్తయ్యాయంటూ.. ఇక పూర్తి స్థాయి దూకుడేనని సంకేతాలిస్తోంది. ఈటల–బండి దూకుడుతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు గట్టి సవాల్‌ విసరాలన్నది వ్యూహం. తెలంగాణ అస్థిత్వం కోసం రాజన్న పోరాటం మరో రాజకీయ ట్రాక్‌. మరోవైపు “నేను సైతం” అంటూ కవిత అడుగులు వేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్‌ అధికారం నిలబెట్టుకునే లెక్కలు.. మరోవైపు బీఆర్‌ఎస్‌ పునరాగమన వ్యూహాలు.. ఇంకోవైపు బీజేపీ దూకుడు.. మధ్యలో కవిత రాజకీయ అడుగులు! తెలంగాణ కొట్లాటలో ఎవరి వ్యూహం పనిచేస్తుంది? ఎవరి లెక్క తారుమారవుతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజన్న చెబుతున్నట్టుగా తెలంగాణ ఎవరి పాలైందన్న వాదన ప్రయాణమెటు? తెలంగాణ రాజకీయాల్లో జరగబోయే ప్రతి కీలక పరిణామాన్ని ‘నా దేశం’ ప్రత్యేక కథనాలతో రేపట్నుంచి మీ ముందుకు తీసుకురాబోతోంది.

 

#TelanganaPolitics #RevanthReddy #Congress #BRS #KCR #TelanganaGovernment #BRSComeback #BJP #EtelaRajender #BandiSanjay #Kavitha #TelanganaElections #TelanganaNews #PoliticalWar #TelanganaPoliticalBattle