వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ ప్రారంభం.
నటుడు ఎన్టీఆర్ ఇటీవల భుజానికి గాయమైంది. వైద్య నిపుణుల సంప్రదింపులు, నిరంతర పర్యవేక్షణ తర్వాత త్వరగా, పూర్తిగా కోలుకునేందుకు ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్లు ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, నితిన్ బెజ్జంకి, మధుసూదన్‌రావు, శ్రీనివాస్‌రావు సురపనేని నేతృత్వంలో చికిత్స జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. త్వరలోనే వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సాధారణ స్థితికి పూర్తిగా చేరేందుకు 2 నుంచి 3 నెలల సమయం పట్టొచ్చని వైద్య బృందం వెల్లడించింది.
#NTR #JrNTR #NTRShoulderSurgery #NTRInjury #NTRHealthUpdate #NTRSurgery #NTRRecovery #NTRRehabilitation #KIMSHospital #Secunderabad #Tollywood #TeluguCinema #NTRLatestNews #CelebrityNews #TollywoodNews











