Home Celebrity హైదరాబాద్‌లో పెళ్లి వేడుకకు జగన్ వధూవరులను ఆశీర్వదించిన మాజీ సీఎం

హైదరాబాద్‌లో పెళ్లి వేడుకకు జగన్ వధూవరులను ఆశీర్వదించిన మాజీ సీఎం



వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు, యువత ఘన స్వాగతం పలికారు. యువత భారీగా వెంట నడవడంతో విమానాశ్రయం నుంచి నగరంలో ఆయన పర్యటన ప్రత్యేక ఆకర్షణగా మారింది. అనంతరం హైదరాబాద్‌లోని జలవిహార్‌ గ్రాండ్‌ లాన్స్‌లో జరిగిన వివాహ వేడుకకు జగన్‌ హాజరయ్యారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కుమారుడు అనంత పినాక్‌ శర్మ వివాహం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వివాహ వేడుకలో పాల్గొన్న జగన్‌ నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వివాహ వేడుకలో నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్‌ శర్మలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడిన జగన్‌ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

#YSJagan #YSJaganMohanReddy #JaganHyderabadVisit #YSRCP #Hyderabad #WeddingCeremony #AnanthaPinakSharma #Snigdha #PSRAnjaneyulu #BegumpetAirport #AndhraPradeshPolitics #YSRCongressParty