డీఎస్సీపై బీటెక్ రవి ఘాటు విమర్శలు.
విద్యార్థులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ నేత బీటెక్ రవి మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని వైసీపీకి, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించడాన్ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. డీఎస్సీ పరీక్షను నీట్ వ్యవహారంతో ముడిపెట్టి మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. తమ నిరసనల్లో నిజమైన నిరుద్యోగులు కాకుండా పార్టీ కార్యకర్తలే కనిపిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రాజకీయ స్వార్థం కోసం అలజడులు సృష్టించవద్దని అవినాష్‌రెడ్డికి సూచించారు.
ప్రజా సమస్యలపై పోరాడాలి
వైసీపీ నేతలకు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే వర్షాభావంతో నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఇప్పించేందుకు పోరాడాలని బీటెక్ రవి సూచించారు. పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పులివెందుల ప్రాంతానికి కొత్త రహదారుల కోసం కేంద్రాన్ని కోరాలని అన్నారు. విద్యార్థులను ధర్నాలకు తీసుకురావడం, పాఠశాల యాజమాన్యాలపై ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. గతంలో కడప జిల్లాలో డీఎస్సీ నియామకాలపై అవినీతి ఆరోపణలు వచ్చి విచారణ అనంతరం పరీక్ష రద్దయిన విషయాన్ని బీటెక్ రవి ప్రస్తావించారు. ప్రస్తుతం నాణ్యమైన పరీక్షా విధానంతో ఎంపికైన ఉద్యోగుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయవద్దని హెచ్చరించారు. ఎంత విమర్శలు చేసినా మంత్రి లోకేశ్ వెంట్రుక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
#BTechRavi #DSCRecruitment #DSCProtests #YSRCP #TDP #NaraLokesh #AndhraPradeshPolitics #DSCExam #TeacherRecruitment #StudentProtests #Unemployment #Pulivendula #APNews #AndhraPradeshGovernment











