భారత క్రికెట్‌లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ రోహిత్ శర్మ భవిష్యత్. వయసు, ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు వస్తున్నా బ్యాట్‌తో మాత్రం రోహిత్ తన క్లాస్‌ను మరోసారి చూపిస్తూనే ఉన్నాడు. 2025 అక్టోబర్ నుంచి ఆడిన చివరి 15 వన్డేల్లో రెండు 120కిపైగా స్కోర్లు నమోదు చేశాడు. నాలుగుసార్లు 70కిపైగా పరుగులు సాధించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగుల సూపర్ ఇన్నింగ్స్‌తో విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మాజీ భారత ఆటగాడు అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడబోతున్నాడనే విషయాన్ని బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ అతనికి స్పష్టంగా చెప్పాలని సూచించాడు. సిరీస్‌కు సిరీస్‌కు నిర్ణయం మార్చే విధానం రోహిత్ లాంటి ఆటగాడికి సరిపోదని రహానే అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌కు అతని అనుభవం ఎంతో అవసరమని చెప్పాడు. క్రికెట్‌లో ఫామ్‌తో పాటు రిథమ్ కూడా కీలకమని, మైండ్ ఫ్రీగా ఉంటేనే ఆటగాడు తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని వివరించాడు. “2027 వరల్డ్‌కప్ ఆడాలంటే.. ఆడాలి. ఈ చర్చే అవసరం లేదు” అన్న రహానే మాటలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
#RohitSharma #AjinkyaRahane #WorldCup2027 #ODIWorldCup #RohitSharmaWorldCup #TeamIndia #IndianCricket #BCCI #RohitSharmaFuture #RohitSharmaODI #ODICricket #CricketNews #IndianCricketNews #RohitSharmaForm











