చిలకలూరిపేటలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. డీఎస్సీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగుతోంది. మాజీ మంత్రి విడదల రజిని, నాగార్జున యాదవ్ దీక్షకు మద్దతుగా పాల్గొన్నారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు శిబిరం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శిబిరాన్ని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో మాజీ మంత్రి విడదల రజినికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో జరిగిన తోపులాటలో రజిని కిందపడిపోయారు. మహిళా నేత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. డీఎస్సీ పరీక్షలో భారీ అక్రమాలు జరిగాయని విడదల రజిని ఆరోపించారు. డీఎస్సీ పోస్టులను సంతలో కూరగాయల్లా అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మూడు రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు శాంతియుతంగా దీక్ష చేస్తున్నారని రజిని తెలిపారు. శిబిరాలు తొలగించడం, మైకులు లాగేయడం, కేసుల పేరుతో బెదిరించడం సరికాదన్నారు. డీఎస్సీ అక్రమాలపై ప్రజల్లోకి వెళ్తున్న వాస్తవాలతో ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు
#VidadalaRajini #DSCProtest #Chilakaluripet #APDSC #DSCRecruitment #DSCControversy #DSCIrregularities #YSRCP #YSRCPProtest #NaraLokesh #RajiniVsPolice #PoliceClash #StudentProtest #YouthProtest #TeacherRecruitment #APPolitics #AndhraPradesh #GovernmentJobs #Unemployment











