వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్నారు. పొగాకు ధరలు పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి టొబాకో ఆక్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న పొగాకు కొనుగోళ్ల తీరును పరిశీలించిన తర్వాత రైతులతో ముఖాముఖి సమావేశమై గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, సాగు ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. కిలో పొగాకుకు కనీసం రూ.200 మద్దతు ధర కల్పించాలని, అవసరమైతే ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు మద్దతుగా ఈ పర్యటన సాగనుంది. రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం పొగాకు సాగుదారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.
#YSJagan #YSJaganMohanReddy #TobaccoFarmers #TobaccoFarmersAP #Devarapalli #TobaccoPrices #TobaccoAuction #TobaccoSupportPrice #AndhraPradesh #APPolitics #YSRCP #FarmerIssues #TobaccoProcurement #JaganNews











