శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహా సరస్వతీ నమః శ్రీ గురుభ్యోనమః
మేష రాశి : పూర్వపు పరిచయాలు లభిస్తాయి. కోర్టు తీర్పు అనుకూలం. భార్యాభర్తలు సఖ్యత పెంచుకోవలెను. ఆర్థిక సద్దుబాట్లు చేయగలుగుతారు. తండ్రి వైపు బంధువులకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతాన అభివృద్ధి గురించి ఆందోళన తగ్గించుకోగలరు. నూతన కార్యకలాపకాలు వాయిదా వేసుకోవటం మంచిది. వ్యసనాల జోలికి పోతే ఆరోగ్యం తగ్గటం,మంచి పేరు తగ్గుతుంది అని గ్రహించగలరు. ఆన్లైన్ కొనుగోళ్లపై జాగ్రత్తలు వహించకపోతే నష్టపోవచ్చు సుమా! క్రీడాకారులకు అనుకూలం. అగ్రిమెంట్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోగలరు. తొందరపాటు నిర్ణయాలు చేటు చేయగలవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నా ముందు కాలం లాభస్తుంది. మార్కెటింగ్ రంగం వారికి ఊరట నిచ్చే వారం. స్త్రీలతో వాదన చేయవద్దు. సంతాన ఆశించేవారు సంతాన గణపతి స్తోత్రం పారాయణ చేయగలరు. శనివారం సాయంత్రం శివాలయం నందు దీపారాధన చేసి కనీసం 21 ప్రదక్షిణ చేయగలరు.
వృషభ రాశి : వ్యక్తిగత విషయాల పట్ల గోప్యత పాటించగలరు. ప్రేమికులు భావోద్వేగాన్ని తగ్గించుకోగలరు. కొంతమంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చినట్లే ఉన్నా పదోన్నతి జారిపోవచ్చు. ఏకాగ్రతను కలిగి ఉండాలి. స్తరాస్తి కొనుగోలు పట్ల అవసరానికి మించిన జాగ్రత్త తీసుకోగలరు. ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి. గృహ నిర్మాణం చేసేవారు మరమ్మత్తుల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు లౌక్యంగాను, తక్కువగాను మాట్లాడటం మంచిది. కళా రంగం లో ఉన్నవారికి నూతన అవకాశాలు వస్తాయి. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండే వారికి స్వస్థత చేకూరును. భూ సమంత లావాదేవీలు పరిష్కార మార్గంగా పయనిస్తాయి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయటం వలన, అభిషేకం చేయడం వలన గ్రహదోష తీవ్రతగును. కందిపప్పు దానం చేయండి.
మిధున రాశి: మిత్రులతో కుటుంబ సభ్యులతో వాదనకు పోవద్దు. కంటికి సంబంధించిన అనారోగ్యం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. స్పైసి ఫుడ్ తక్కువగా తీసుకోగలరు. ఆకస్మిక ప్రయాణాలకు ఆస్కారం. జ్వర సంబంధ అనారోగ్యం పట్ల తగు జాగ్రత్త తీసుకోగలరు. రక్తసంబంధీకులతో సఖ్యత పెంచుకోగలరు. ఉన్నత విద్య ప్రయత్నాలు అనుకూలించేందుకై దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయగలరు. ప్రేమికులకు అనేక ఆటంకాలు ఉంటాయి. దుందుడుకు నిర్ణయాలు చేటు చేయగలవు జాగ్రత్త సమా!. శత్రువులను జయించేందుకై హనుమత్ బడబాలన స్తోత్రాన్ని పారాయణ చేయగలరు. విలువైన వస్తువులను కొనుగోలు వాయిదా వేసుకోగలరు. కుటుంబంపై మీ అభిప్రాయాలను రుద్ద వద్దు. 4 వ తారీకు అనుకూలం.శుక్రవారం ఆడికృతిక పర్వదినం కావున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి క్షీరాభిషేకం చేయించండి.
కర్కాటక రాశి : ఉద్యోగస్తులకు పదోన్నతికి ఆస్కారం ఉంది. వృద్ధులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించగలరు. విదేశ విద్య అభ్యసించాలనుకునే వారికి వీసా వస్తుంది. అహంభావం తగ్గించుకుంటే అందరి మన్ననలు పొందుతారు. ప్రజాజీవనం చేసే వారికి పదవీ బాధ్యత లభించేందుకు ఆస్కారం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనానికి ఆస్కారం ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలించేందుకై గణపతి ఆరాధించండి. శుక్రవారం ఆడికృత్తిక పర్వదినం కావున సుబ్రమణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. వ్యాపారస్తులకు మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఇతరులకు హామీ ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులకు రాని బాకీలు వసూలు అగును వ్యాపార విస్తరణకు ఆస్కారం ఉంది. బంధుమిత్రుల సహకారంతో పనులు సానుకూలం చేసుకుంటారు. పిత్రార్జిత ఆస్తులు వచ్చేందుకు ఆస్కారం ఉంది. గృహంలో అన్ని సౌకర్యాలు ఉన్న ఆస్వాదించలేని గృహస్థితి ఉంది. 5 వ తారీకు నుండి అనుకూలం. గణపతి షోడశ నామాల పారాయణ మేలు చేస్తుంది.
సింహరాశి: ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ, కంటి సంబంధ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోగలరు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉండి అధికారుల గుర్తింపుకు నోచుకోలేని పరిస్థితిని గమనిస్తారు. నిరుద్యోగులకు చిన్న ఉద్యోగమైన వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి లక్ష్మీ కటాక్షం. ఉన్నత విద్యకు అనుకూలం. స్వగృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యతో ప్రేమగా ఉంటూ సఖ్యత పెంచుకోగలరు. నూతన వాహన కొనుగోలుకై చేసే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రణాళికాబద్ధంగా చేసే పనులు అనుకూలిస్తాయి. పెద్దల పరిచయాలు ప్రయోజనకారిగా ఉంటాయి. విద్యార్థుల ప్రతిభకు తగిన అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు చేతికి అందుతాయి. టెక్నికల్ రంగం వారికి అనుకూలం.8 వ తారీకు అనుకూలం. ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది. రావి చెట్టు ప్రదక్షణ గ్రహదోష తీవ్రతను తగ్గించగలదు.
కన్యా రాశి : ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు సహాయం చేయటానికి ముందుకొస్తారు. కుటుంబ బాధ్యతలను ప్రణాళికాబద్ధంగా నేర్పుతో పూర్తి చేస్తారు. ఆర్థిక పుష్టి కలిగి ఉంటారు. సంతానపరమైన సమస్యలు పరిష్కరించబడతాయి. క్రీడాకారుల శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నూతన ప్రాజెక్టు రావటం వలన ఉత్తేజాన్నిస్తుంది. పనులు చికాకుగా చికాకును కలిగించినా పూర్తి చేస్తారు. ప్రేమికుల మధ్య మానసిక ఒత్తిడి ఉంటుంది. దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగేందుకై సౌందర్యలహరి పారాయణ మేలు చేస్తుంది.5 వ తారీకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవటం మంచిది. స్త్రీలను గౌరవించడం వల్ల గ్రహదోష తీవ్రత తగ్గును.
తులారాశి : పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆరోగ్యం మెరుగు పడటం ప్రారంభమవుతుంది. గృహోపకరణాలు మరమ్మత్తులకు ఆస్కారం ఉంది. కుటుంబంలో భర్త సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆహార సమతుల్యం పాటించగలరు. ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా పయనిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఉద్యోగ మార్పునకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సెల్ ఫోన్ జారి కింద పడవచ్చు జాగ్రత్త సుమా! స్నేహితుల పట్ల ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. వ్యాపారu విస్తరణకై సలహాలను స్వాగతిస్తారు. నిద్రలేమికి ఆస్కారం ఉంది. 7 వ తారీకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోగలరు. లలితా సహస్ర నామావళి పారాయణ, నవగ్రహ స్తోత్ర పారాయణ గ్రహదోష తీవ్రతను తగ్గించగలదు.
వృశ్చిక రాశి: ఉద్యోగస్తులకునూతన సాంకేతికత ను ఆపాదించుకోవడం వలన పని భారం తగ్గింది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అన్ని విధాల అనుకూలమే. పుణ్యక్షేత్ర దర్శనానికి ఆస్కారం ఉంది. అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. భార్య ఆరోగ్యం పై శ్రద్ధ వహించగలరు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులు పోటీ తత్వాన్ని అధిగమించి ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. తప్పులు సరిదిద్దుకుంటూ లక్ష్య సాధనగా పయనిస్తారు. 5,6,7,8 వ తారీకులు అనుకూలం. 7 వ తారీకు ఆడికృతిక పర్వదినం సుబ్రమణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. లక్ష్మీ అష్టక పారాయణ మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి : మిమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనా ఓర్పు వహిస్తూ మెలగవలెను. గృహిణులు తమ కుటుంబ సభ్యుల పట్ల మరింత ప్రేమ అనురాగాలను పంచగలరు. ఆకస్మిక ప్రయాణాల వలన చెప్పుకోలేక ప్రయోజనం లేదు. కడుపు నొప్పి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. పౌరుషానికి పోతే ఉన్న పరువు పోతుంది అనుగ్రహించి ఓర్పు వహించగలరు. ఆర్థిక అసమానతలు ఉంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యత పెరుగును. ప్రేమ వికటిస్తుంది. మీకున్న దాంట్లో దాతృత్వాన్ని చాటుకుంటారు. విద్యార్థులకు గ్రహ స్థితి సామాన్యంగా ఉంది. సూర్యాష్టక పారాయణ మేలు చేస్తుంది. ఆదివారం నవగ్రహాలలో ఉన్న సూర్యుడు గ్రహం వద్ద దీపం ఉంచి 27 ప్రదక్షిణాలు చేయగలరు.
మకర రాశి: విద్యార్థులు బద్ధకం తగ్గించుకొని ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించగలరు. ధైర్యాన్ని పెంచుకుంటూ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వండి ఉద్యోగం వచ్చి తీరుతుంది. దైవ కార్యాలలో, సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. భూ సమంద లా వాదీవీలు కొంత మేర అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు రాని బాకీలు వస్తాయి. ప్రజా జీవనం చేసే వారికి వారాంతంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. పెళ్లిచూపులు కళ్యాణ మండపం బుక్ చేసే స్థితికి దారి తీస్తుంది. చికాకు తగ్గించుకోగలరు.కళా రంగంలో ఉండే వారికి కొంచెం ఆలస్యంగా నైనా అవకాశాలు వస్తాయి.
ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వాకింగ్ చేయడం వలన,4 వ తారీకు అనుకూలం. ఆలయాలలో సేవ చేయటం వల్ల, కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయడం వలన గ్రహదోష తీవ్రత తగ్గును.
కుంభరాశి : ఖర్చులు నియంత్రించుకోవడంలో పట్టు సాధిస్తారు. చేపట్టిన పనులు ఆలస్యంగా నైనా పూర్తవుతాయి. నిరుద్యోగులకు చిన్న ఉద్యోగమైన వస్తుంది. వివాహ ప్రయత్నాలుకు ఎక్కువ సమయం కేటాయించాలి. అవసరాలకు డబ్బు చేతికందుతుంది. ప్రతి పని అధికంగా శ్రమిస్తే కానీ పూర్తి కాదు. ఆస్తి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. శారీరక బడలిక గమనిస్తారు. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించగలరు. కనకధారా స్తోత్రం చేయడం వలన ఆర్థిక సమానత్తులు తొలగుతాయి. పెద్ద ముత్తయిదువు ఆశీర్వచనం తీసుకోవడం వలన పనులు త్వరితగతిన అవుతాయి.2 వ తారీకు అనుకూలం. బొబ్బర్లు గోమాతకు ఆహారంగా పెట్టండి.
మీన రాశి : క్రీడాకారులు జట్టును విజయతీరానికి చేరుస్తారు. వాహన చోదకులు వేగ నియంత్రణను పాటించగలరు. మిత్రులతో సఖ్యత పెంచుకోగలరు. బంధువుల ఆదరణతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక సర్దుబాటులకు ఆస్కారం ఉంది. మీ ఇంట మామిడి తోరణం కట్టే ఘడియలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనానికి ఆస్కారం ఉంది. పిత్రార్జితం వచ్చే ఆస్కారం ఉంది. బయటికి వెళ్లినప్పుడు మీ వస్తువులను మర్చిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి. విదేశ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వీసా వస్తుంది. కనిష్ట సోదరులతో సఖ్యత పెంచుకోగలరు. పెద్ద ముత్తైదువును సత్కరించడం వలన మీ పనులన్నీ సానుకూలమగును. ఆవేశం తగ్గించుకోవటము వలన మచ్చలేని మనిషిగా ఉంటారు.2,4,8 వ తారీకులు అనుకూలం. సూర్య ద్వాదశ నామాలు పారాయణ చేయగలరు. శని వజ్రపంజర కవచం పారాయణ చేయగలరు.

టీటీడీ అనుబంధ సంస్థ సమరసత సిద్ధాంతి దైవజ్ఞ పులిపాక చంద్రశేఖర శర్మ శ్రీ చక్ర పంచాంగ కర్త 9440783005











