Home AP చేనేతకు చేయూత.. విజయవాడలో ఆగస్టు 5న మహా సమ్మేళనం

చేనేతకు చేయూత.. విజయవాడలో ఆగస్టు 5న మహా సమ్మేళనం

BJP Handloom Convention Vijayawada

చేనేతకు బీజేపీ భరోసా.. విజయవాడలో ఆగస్టు 5న సమ్మేళనం
చేనేత రంగ పరిరక్షణ, చేనేత కార్మికుల సంక్షేమానికి చేయూతనివ్వాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆగస్టు 5న విజయవాడలో మహా చేనేత సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి భారీ శోభాయాత్ర ప్రారంభమై, ఉదయం 9.30 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
అభివృద్ధిపై చర్చలు
సమ్మేళనంలో చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సంప్రదాయ చేనేత కళల పరిరక్షణ, కొత్త మార్కెట్ అవకాశాలపై నిపుణులతో విస్తృతంగా చర్చలు నిర్వహించనున్నారు. చేనేత మహనీయుల సేవలను గుర్తు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వదేశీ ఉత్పత్తులు, సంప్రదాయ చేనేత వస్త్రాలు, కళా ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు
చేనేత కళాకారులు, కార్మికులు, చేనేత సంఘాల ప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, చేనేత అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. “మన చేనేత – మన ఆత్మగౌరవం.. మన వారసత్వం – మన భవిష్యత్తు” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనం చేనేత రంగానికి కొత్త దిశను చూపుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
నాయకుల హాజరు
ఈ సమావేశంలో కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ముప్పె వెంకట్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు పాములేటి, జిల్లా చేనేత సెల్ అధ్యక్షుడు సిలివేరి వెంకటేశ్వర్లు, టౌన్ అధ్యక్షుడు నరేంద్ర, ప్రధాన కార్యదర్శి శ్రీశ్రీ, కార్యదర్శి మోహన్ కృష్ణ, కొండయ్య తదితరులు పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.