అద్దరిపేటలో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సమర్థ వేదిక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనేక ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన ప్రధాన సమస్యలపై శాఖాపరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు మీడియా కోఆర్డినేటర్ రాంబాబు ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
ప్రజలకే ఎమ్మెల్యే ప్రాధాన్యం… ప్రజాదర్బార్‌తో సమస్యలకు పరిష్కారం
Yanamala Divya Praja Darbar











