Home Telangana 48 గంటల అల్టిమేటం.. మాటల మహాయుద్ధం!

48 గంటల అల్టిమేటం.. మాటల మహాయుద్ధం!


రేవంత్‌ ఆరోపణలు… కేటీఆర్‌ లీగల్‌ కౌంటర్‌!

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గ్లోబరీనా సంస్థ కేటీఆర్‌ బినామీదేనంటూ సంచలన ఆరోపణలు చేస్తే… మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహంతో 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. “ఆధారాలు ఉంటే నిరూపించండి… లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పండి” అంటూ లీగల్‌ నోటీసు హెచ్చరిక చేశారు. “గ్లోబరీనాతో నాకు, నా కుటుంబానికి, బీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు” అని కేటీఆర్‌ స్పష్టం చేస్తుంటే… “ముమ్మాటికీ అదే కేటీఆర్‌ బినామీ సంస్థ” అంటూ రేవంత్‌ తన ఆరోపణలను మరింత పదును పెట్టారు. ఒకరు పరువు నష్టం దావా అంటుంటే… మరొకరు విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మాటల యుద్ధం ఇప్పుడు న్యాయ పోరాటం వైపు అడుగులు వేస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.

 

#RevanthReddy #KTR #Globarena #TelanganaPolitics #PoliticalRow #LegalNotice #DefamationCase #BRS #TelanganaNews #PoliticalWar