🐏 మేష రాశి: అనుకోని ప్రయాణాలకు అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించగలరు. స్పైసీ ఆహారం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. లౌక్యంగా మాట్లాడటం మేలు.

🐂 వృషభ రాశి: వాహన సౌఖ్యం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

👫 మిథున రాశి: శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఓర్పుతో వ్యవహరించండి. దుర్గమ్మను ఆరాధించడం శుభప్రదం.

🦀 కర్కాటక రాశి: ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. హనుమాన్ ఆలయ దర్శనం శుభఫలితాలను ఇస్తుంది.

🦁 సింహ రాశి: ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. అవమానకర పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ నిర్ణయాలను అందరి అభిప్రాయంతో తీసుకోండి. సూర్య నమస్కారాలు చేయండి.

👧 కన్యా రాశి: భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయండి. సోదర, సోదరీల అభివృద్ధికి సమయం కేటాయిస్తారు. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం.

⚖️ తులా రాశి: జీవిత భాగస్వామి నిర్ణయాలను గౌరవిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. మృదువుగా మాట్లాడటం ప్రయోజనకరం.

🦂 వృశ్చిక రాశి: ఆహార నియమాలు పాటించడం మంచిది. వృత్తిపరమైన నిర్ణయాలు ఆశ్చర్యకర ఫలితాలను ఇవ్వవచ్చు.

🏹 ధనస్సు రాశి: వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. మిత్రులతో నిజాయితీగా ఉండండి. టెన్షన్‌కు దూరంగా ఉండి ప్రశాంతంగా ఆలోచించండి.

🐊 మకర రాశి: తల్లి చెప్పిన మాటకు విలువ ఇవ్వండి. చిన్న ప్రయాణాలకు అవకాశం ఉంది.

🏺 కుంభ రాశి: వృత్తిపరమైన ఖర్చులు ఇతరత్రా లాభిస్తాయి. వాక్కే లక్ష్మిగా భావించండి. తలపెట్టిన కార్యాలు విజయతీరాన్ని చేరుతాయి. లౌక్యంగా మాట్లాడటాన్ని మరింత పెంచాలి.

🐟 మీన రాశి: ప్రయాణానికి అవకాశం ఉంది. ఆందోళన చెందకుండా నిదానంగా ఆలోచిస్తే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శరీరానికి చలవ చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.


టీటీడీ అనుబంధ సంస్థ సమరసత సిద్ధాంతి
పులిపాక చంద్రశేఖర్ శర్మ శ్రీ చక్ర పంచాంగ కర్త
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 9440783005