Home General ఐఫోన్‌ 18 ప్రో వచ్చేస్తోంది ధర భారీ.. ఫీచర్లు అదిరే

ఐఫోన్‌ 18 ప్రో వచ్చేస్తోంది ధర భారీ.. ఫీచర్లు అదిరే


బ్యాటరీ పెంపు.. కెమెరాకు కొత్త టచ్
ఏ20 ప్రో చిప్‌తో ఐఫోన్‌ కొత్త జోరు
సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్‌?

యాపిల్‌ ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌పై టెక్‌ ప్రపంచంలో ఆసక్తి పెరుగుతోంది. ఐఫోన్‌ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్లను సెప్టెంబర్‌ 2026లో యాపిల్‌ తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే లాంచ్‌ తేదీ, ఫీచర్లు, ధరపై కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. లీక్‌ల ప్రకారం కొత్త ఫోన్లలో ఏ20 ప్రో చిప్‌, మెరుగైన డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, అప్‌గ్రేడ్‌ కెమెరా వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజువారీ పనులతో పాటు గేమింగ్‌, వీడియో ఎడిటింగ్‌, ఆన్‌డివైస్‌ ఏఐ వినియోగంలో పనితీరు మరింత మెరుగుపడొచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.

కెమెరా.. బ్యాటరీలో భారీ అప్‌గ్రేడ్

ఐఫోన్‌ 18 ప్రోలో ప్రధాన 48ఎంపీ ఫ్యూజన్‌ కెమెరాకు వేరియబుల్‌ అపెర్చర్‌ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీని వల్ల పోర్ట్రెయిట్‌, తక్కువ వెలుతురు ఫొటోగ్రఫీలో మెరుగైన ఫలితాలు రావచ్చు. కెమెరా కంట్రోల్‌ బటన్‌లోనూ మార్పులు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. మరో కీలక అప్‌గ్రేడ్‌ బ్యాటరీ. ముఖ్యంగా 18 ప్రో మ్యాక్స్‌లో 5,200–5,500 ఎంఏహెచ్ సామర్థ్యం ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. పెద్ద బ్యాటరీ కోసం ఫోన్‌ కొద్దిగా మందంగా మారే అవకాశం ఉంది. కొత్త సీఎ2 మోడెమ్‌తో 5జీ వేగం, సిగ్నల్‌ స్థిరత్వం, పవర్‌ ఎఫిషియెన్సీ మెరుగుపడొచ్చని అంచనాలు ఉన్నాయి.

డైనమిక్‌ ఐలాండ్‌ చిన్నదే.. ధర పెద్దదే?

డైనమిక్‌ ఐలాండ్‌ పరిమాణాన్ని తగ్గించే ప్రయత్నం యాపిల్‌ చేస్తోందని లీకులు చెబుతున్నాయి. 6.3 అంగుళాల ప్రో, 6.9 అంగుళాల ప్రో మ్యాక్స్‌ డిస్‌ప్లేలకు ఎల్టీపీఓ, ఓఎల్ఈడీ, ప్రొమోషన్ టెక్నాలజీ ఉండొచ్చని సమాచారం. అయితే ఈ అప్‌గ్రేడ్‌లకు తగ్గట్టే ధర కూడా పెరగొచ్చని అంచనా. భారత్‌లో ఐఫోన్‌ 18 ప్రో ప్రారంభ ధర సుమారు రూ.1,54,900 ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐఫోన్‌ 17 ప్రోతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి లీకులు, అంచనాలే. యాపిల్‌ అధికారిక ప్రకటన తర్వాతే అసలు ధర, ఫీచర్లపై స్పష్టత రానుంది.

 

#iPhone18Pro #iPhone18ProMax #iPhone18 #Apple #iPhone18Launch #iPhone18Leaks #A20Pro #iPhone18Camera #iPhone18Battery #iPhone18Price #AppleIndia #DynamicIsland #iPhone18ProMax #TechNews #AppleNews #iPhoneLeaks #iPhone2026