వదులుకుంటే భారీ నష్టమే!
భవిష్యత్ స్టార్‌ను కాపాడుకోండి!
ఐపీఎల్–2027 వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ కీలక సూచనలు చేశాడు. యువ సంచలనం ఆయుష్ మాత్రేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని స్పష్టం చేశాడు. అతడు సీఎస్కే భవిష్యత్‌లో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని, మూడో స్థానంలోనూ, ఓపెనర్‌గానూ విధ్వంసకరంగా ఆడగలడని ప్రశంసించాడు. ఇటీవల హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న మాత్రే రెండు నుంచి మూడు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉన్నా అతడిపై నమ్మకం తగ్గించుకోవద్దని సూచించాడు. మరోవైపు ఉర్విల్ పటేల్‌ను ట్రేడ్ చేయడంపై సీఎస్కే ఆలోచించాలని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్ వంటి బ్యాటర్లు జట్టులో ఉండటంతో ఉర్విల్‌కు అవకాశాలు తగ్గవచ్చన్నాడు. టాప్ ఆర్డర్లో రద్దీ తగ్గించి, ఉర్విల్‌కు మరో జట్టులో ఎక్కువ అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నాడు. ఇదే సమయంలో శివమ్ దూబేను మాత్రం వదులుకోవద్దని గట్టిగా చెప్పాడు. స్పిన్‌ను చితక్కొట్టే ఎడమచేతి బ్యాటింగ్, అవసరమైనప్పుడు మీడియం పేస్ బౌలింగ్ అతడి ప్రత్యేకతలని వివరించాడు. చెపాక్‌లో నెమ్మదైన పిచ్‌లపై దూబే బౌలింగ్ కూడా ఉపయోగపడుతుందని గుర్తుచేశాడు. నవంబర్ 17 రిటెన్షన్ గడువు, డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలానికి ముందు సీఎస్కే తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది!
#IPL2027 #CSK #ChennaiSuperKings #AyushMhatre #ShivamDube #AbhinavMukund #UrvilPatel #IPLAuction #CSKRetention #CricketNews











