కేంద్రం వైఖరితో జగన్ వెక్స్.
అమీతుమీ తేల్చుకుందుకు ఫిక్స్
చంద్రబాబుకు ఝలక్.
ఈసీపై ఆధారాలతో అటాక్.
వైసీపీ అధినేత సెన్సేషన్.
మారుతున్న ఈక్వేషన్.
2019లో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్.. ఇప్పుడు మరోసారి అదే పోరాటానికి సిద్ధమవుతున్నారా? మోదీతో సఖ్యతగా ఉంటేనే రాజకీయ మనుగడ సాధ్యమనే లెక్కలను పక్కనపెట్టి, కేంద్రాన్నే ప్రశ్నించే సాహసానికి దిగుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్! 2018లో బీజేపీతో విభేదించిన చంద్రబాబు 2019లో అధికారం కోల్పోయారు. 2024లో బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబు తిరిగి అధికార పీఠాన్ని అధిరోహిస్తే.. ఒంటరిగా బరిలోకి దిగిన జగన్ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. జగన్ వెనక్కి తగ్గడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం నియామక విధానంపై గతంలో మద్దతు ఇవ్వడం తప్పిదమని బహిరంగంగా ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది కేవలం ఎన్నికల సంఘంపై అసంతృప్తేనా? లేక కేంద్రంలోని అధికార వ్యవస్థతో తలపడేందుకు ముందస్తు సంకేతమా? చంద్రబాబు బాటకు భిన్నంగా.. తనదైన దారి ఎంచుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారా? పోరాడితే పోయేదేముంది.. అన్న ధోరణితో కొత్త రాజకీయ యుద్ధానికి తెరతీస్తున్నారా? జగన్ తాజా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం, కేంద్రంతో మారుతున్న సంబంధాలు, ఏపీ రాజకీయాలపై పడనున్న ప్రభావం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే!
#YSJagan #YSRCP #ElectionCommission #GyaneshKumar #AndhraPradeshPolitics #ChandrababuNaidu #NarendraModi #PoliticalAnalysis #TDP #IndianPolitics #PoliticalStrategy











