Home Telangana రూ.39 లక్షల బిడ్‌.. ఎవరీ ప్రణీత్‌రెడ్డి?

రూ.39 లక్షల బిడ్‌.. ఎవరీ ప్రణీత్‌రెడ్డి?

అమెరికా నుంచి వచ్చి.. భారీ బిడ్‌

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంలో రూ.39 లక్షల భారీ బిడ్‌ వేసి ప్రసాదాన్ని దక్కించుకున్న సామ ప్రణీత్‌రెడ్డి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 35 ఏళ్ల ప్రణీత్‌రెడ్డి హైదరాబాద్‌లోని వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త. అర్బన్‌ రియాలిటీ గ్రూప్‌తో అనుబంధంగా ఉన్న ఆయన ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం అర్బన్‌ గ్రూప్‌ పేరుతో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించారు. బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లడ్డూ వేలంలో పాల్గొన్న ఆయన, ఇతర బిడ్డర్లను వెనక్కి నెట్టి అత్యధిక ధరతో ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.

రూ.450 నుంచి రూ.39 లక్షలకు

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం సంప్రదాయం 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది వేలం నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తులు వేలంలో లడ్డూను దక్కించుకోవడం ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నారు. కాలక్రమంలో లడ్డూ ధర భారీగా పెరిగింది. 2025లో రూ.35 లక్షలకు లడ్డూ వేలం జరిగింది. ఈ ఏడాది ప్రణీత్‌రెడ్డి వేసిన రూ.39 లక్షల బిడ్‌ గతేడాది ధర కంటే రూ.4 లక్షలు ఎక్కువ. దీంతో బాలాపూర్‌ లడ్డూ వేలంలో మరో కొత్త రికార్డు నమోదైంది. ప్రసాదాన్ని దక్కించుకున్న ప్రణీత్‌రెడ్డి పేరు ఈ ఏడాది గణేశ్‌ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

 

#PraneethReddy #SamaPraneethReddy #BalapurGanesh #BalapurLaddu #GaneshLadduAuction #39LakhBid #BalapurGanesh2026 #GaneshAuction #HyderabadGanesh #GaneshFestival #GaneshUtsav #UrbanRealityGroup #Vanasthalipuram #Hyderabad #TelanganaNews