Home AP 73వ డివిజన్‌లో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు డిమాండ్

73వ డివిజన్‌లో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు డిమాండ్

విజయవాడ నగరపాలక సంస్థ 73వ డివిజన్‌లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని స్వతంత్ర అభ్యర్థి ఏవీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) డిమాండ్ చేశారు. రాజరాజేశ్వరిపేట కేర్ అండ్ షేర్ వీఎంసీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఓటర్లు భయంతో చెదిరిపోయారని, పలువురు మహిళలు ఓటు వేయకుండానే వెళ్లిపోయారని ఆరోపించారు. ఫొటోలు, వీడియోలతో ఎన్నికల సంఘం, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వైసీపీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని, టీడీపీ వారిపై చర్యలు తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఎం నేత బాబూరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావుతో కలిసి పోలింగ్ కేంద్రం వెలుపల నిరసనకు దిగారు. రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగిన ఆందోళనపై డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఇద్దరు ఏసీపీలు చర్చించారు. అర్ధరాత్రి 12 గంటల్లోపు నిర్ణయం వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారిణి హామీ ఇవ్వడంతో నిరసనను తాత్కాలికంగా విరమించారు.

 

#Vijayawada #VijayawadaMunicipalPolls #Division73 #RepollingDemand #AVVenkateswaraRao #Rajarajeswaripeta #PollingBoothClash #TDP #YSRCP #AndhraPradeshPolitics #ElectionNews