Home AP బెజవాడలో బిగ్‌ ఫైట్‌

బెజవాడలో బిగ్‌ ఫైట్‌

వంగవీటికి దేవినేనితో టైట్ .
రాధాకు అవినాష్‌తో చెక్.
పవన్‌కు జగన్ స్పార్క్.
ఎత్తుకు పై ఎత్తులు.
వ్యూహాలకు ప్రతి వ్యూహాలు.

బెజవాడ రాజకీయాల్లో మరోసారి పాత ప్రత్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి! మేయర్‌ పీఠం చుట్టూ మొదలైన రాజకీయ కదలికలు ఇప్పుడు వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య పోటీ చర్చకు దారితీస్తున్నాయి. టీడీపీలో మేయర్‌ పదవిని ఆశిస్తున్న నాయకులు ఎక్కువగా ఉండటంతో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే ప్రతిపాదన ముందుకొచ్చిందన్న ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా వంగవీటి రాధాకృష్ణను జనసేన అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తిని పెంచాయి. రాధా, జనసేనలో చేరడం ఆయనే బరిలో దిగుతున్నారంటూ ప్రచారం మొదలుకాగానే… రాధాకు ఎదురుగా దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపాలని వైసీపీ అధినేత జగన్‌ ఆలోచిస్తున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కీలక చర్చ. ఒకవైపు కూటమి సమన్వయం.. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఎంపిక.. ఇంకోవైపు కమ్మ, కాపు సామాజిక సమీకరణాలు! ఇలా విజయవాడ మేయర్‌ పోరు అనేక రాజకీయ కోణాలను సంతరించుకుంటోంది. గతంలో రాజకీయంగా ప్రాధాన్యం పొందిన రెండు కుటుంబాల పేర్లు మళ్లీ ఒకే ఎన్నిక నేపథ్యంలో వినిపించడం ఉత్కంఠను పెంచుతోంది. టీడీపీ నాయకులు జనసేన అభ్యర్థికి ఎంతవరకు సహకరిస్తారు? సామాజిక సమీకరణాలు ఓటర్లపై ప్రభావం చూపుతాయా? జగన్‌ నిజంగానే అవినాష్‌ వైపు మొగ్గు చూపుతారా? బెజవాడలో పాత వైరం కొత్త రాజకీయ పోరుగా మారుతుందా..? మేయర్‌ పీఠం కోసం తెరవెనుక ఎలాంటి వ్యూహాలు సిద్ధమవుతున్నాయి? అసలు కథ లోతుల్లోకి వెళ్తేనే ఈ రాజకీయ చదరంగంలోని ఆసక్తికరమైన మలుపులు బయటపడతాయి!

 

#VijayawadaPolitics #VijayawadaMayor #VangaveetiRadha #DevineniAvinash #YSJagan #PawanKalyan #TDP #Janasena #YSRCP #AndhraPradeshPolitics #LocalBodyElections #PoliticalNews