జనగణమనతో సమాన గౌరవం
రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మార్పు
‘వందేమాతరం’కు ‘జనగణమన’తో సమానంగా చట్టపరమైన రక్షణ కల్పించే కీలక సవరణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్’ చట్టం-1971 పరిధిలో జాతీయ గీతంతో పాటు జాతీయ గీతికకు కూడా రక్షణ లభించింది. వందేమాతరం గానం జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, గానం చేస్తున్న సమూహానికి అంతరాయం కలిగించడం ఇక శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. వందేమాతరానికి చట్టబద్ధ రక్షణ కల్పించే సవరణ బిల్లును పార్లమెంట్ జూలైలో ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపగా, మంగళవారం ఆమె సంతకం చేయడంతో చట్టంగా మారింది. ఈ సవరణతో వందేమాతరానికి ఉన్న జాతీయ ప్రాధాన్యానికి చట్టపరమైన బలం చేకూరింది. జాతీయ గీతం, జాతీయ గీతిక పట్ల గౌరవాన్ని కాపాడేలా చట్టం పరిధి విస్తరించింది.
#VandeMataram #VandeMataramLaw #VandeMataramLegalProtection #JanaGanaMana #NationalSong #NationalAnthem #DroupadiMurmu #IndianLaw #NationalHonour #Parliament #IndiaNews #LegalProtection #IndianNationalSymbols #BreakingNews #NationalNews











