చిన్న శ్రీను ప్రస్తావనతో భావోద్వేగం.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గురువారం విజయనగరం జిల్లా గరివిడిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఇటీవల ఆయన మేనల్లుడు, విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పనిచేసిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీని వీడి టీడీపీలో చేరిన అంశాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. పార్టీతో కలిసి నడిచిన రోజుల్ని, తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నేతలు మాట్లాడుతున్న సమయంలో బొత్స తీవ్రంగా కలత చెందారు. “నమ్మినవాళ్లే మోసం చేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపు భావోద్వేగానికి లోనైన బొత్సను ఆయన కుమార్తె బొత్స అనూష ఓదార్చారు. పార్టీ కోసం కలిసి పనిచేసిన వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స కంటతడి పెట్టడం సమావేశంలో ఉన్న కార్యకర్తలను కూడా కదిలించింది. తనను తాను సముదాయించుకున్న బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. “వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం” అని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ఆశయాల కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచే కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి నిజమైన వెన్నుదన్ను అని అన్నారు.
#BotsaSatyanarayana #Botsa #ChinnaSrinu #MajjiSrinivasaRao #ChinnaSrinuTDP #TDP #YSRCP #BotsaEmotional #BotsaTears #BotsaSatyanarayanaEmotional #YSRCPExit #TDPJoining #Vizianagaram #VizianagaramPolitics #NorthAndhra #YSRCPVizianagaram #YSRCPLeaders #YSRCPCadre #AndhraPradeshPolitics #APPolitics #LocalBodyElections #Jagan #YSJagan #APNews











