అగ్నిగుండంలా మారిన కోల్డ్ వార్…
దావానలంలా రగులుతున్న కూటమి సర్కార్.
ఒంగోలులో స్టార్ట్.. హైకమాండ్ బీ అలెర్ట్.
ఒంగోలులో బాలినేని–దామచర్ల మధ్య మొదలైన రాజకీయ కోల్డ్‌వార్.. ఇప్పుడు కేవలం ఇద్దరు నేతల మధ్య వివాదంగా కనిపించడం లేదు. బయటకు కనిపిస్తున్న మాటల యుద్ధం వెనుక.. కూటమి రాజకీయాల్లో పేరుకుపోతున్న అసంతృప్తి మంటలు కనిపిస్తున్నాయి. స్థానిక ఆధిపత్యం.. రాజకీయ ప్రాధాన్యం.. పదవుల పంపకం.. కార్యకర్తల గుర్తింపు.. భాగస్వామ్య పార్టీల గౌరవం.. ఒక్కో అంశం ఇప్పుడు ఒక్కో ప్రశ్నగా మారుతోంది. బాలినేని–దామచర్ల వివాదం ముగింపు కాదు.. రాబోయే రాజకీయ తుఫాన్‌కు ఇది తొలి సంకేతమన్న చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో అవసరాల కోసం ఒక్కటైన రాజకీయ శక్తులు.. అధికారం వచ్చాక తమ ప్రయోజనాల విషయంలో ఎంతవరకు రాజీపడతాయన్నదే అసలు ప్రశ్న. రాజకీయంగా తమ భవిష్యత్తుకు ఇబ్బంది వస్తే.. పార్టీ నిర్ణయాలనే ప్రశ్నించే స్థాయికి నాయకులు వెళ్లరన్న గ్యారంటీ లేదు. అవసరమైతే పవన్ కళ్యాణ్ నిర్ణయాలపైనా.. చంద్రబాబు నాయుడు వ్యూహాలపైనా ప్రశ్నలు సంధించే పరిస్థితి రావచ్చన్న సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. బొలిశెట్టి సత్యనారాయణ లేవనెత్తిన ప్రశ్నలు ఈ చర్చకు మరింత పదును పెట్టాయి. నామినేటెడ్ పదవుల పంపకంపై శ్వేతపత్రం డిమాండ్.. కూటమి లోపలి లెక్కలను బహిరంగ చర్చలోకి తెచ్చింది. హెచ్చరికలతో రాజకీయ సెగను తాత్కాలికంగా తగ్గించవచ్చు.. కానీ అసంతృప్తి మూలాలను తొలగించకపోతే మంట మళ్లీ ఎగసిపడుతుంది. ఒంగోలులో మొదలైన ఈ చిచ్చు.. రానున్న రోజుల్లో కూటమి అంతర్గత రాజకీయాలను ఎంతటి పీక్‌కు తీసుకెళ్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
#OngolePolitics #BalineniSrinivasaReddy #DamarlaJanardhan #APPolitics #AndhraPradeshPolitics #APCoalition #TDP #Janasena #ChandrababuNaidu #PawanKalyan #CoalitionGovernment #PoliticalTensions #Ongole #BolisettiSatyanarayana #APPoliticalNews











