Home AP ఎన్వీడియా కథలో ట్విస్ట్…

ఎన్వీడియా కథలో ట్విస్ట్…

సీఈవోగా తిరిగి జెన్సన్ ఎంట్రీ.
సెక్స్ ఆరోపణలు, స్పై వివాదంతో టెక్నాలజీ సామ్రాజ్యంలో కుదుపు.
చైనా గూఢచర్యం అనుమానాలతో పెరిగిన అంతర్జాతీయ కలకలం.
పదకొండు రోజుల్లోనే రాజీనామా, తిరిగి అదే స్థానంలోకి ప్రవేశం.
ట్రంప్‌ మద్దతుతో మారిన ఎన్వీడియాలో మారిన సమీకరణాలు.
చిప్స్‌ సరఫరా వివాదం, అమెరికా జాతీయ భద్రతకు సవాల్.
వ్యక్తిగత బలహీనతలు, కార్పొరేట్‌ సామ్రాజ్యాలకు గుణపాఠం.


ప్రపంచ టెక్నాలజీ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా వివాదాల తుపానులో చిక్కుకున్నారు. వ్యక్తిగత సంబంధాలపై ఆరోపణలు.. చైనా గూఢచర్యం అనుమానాలు.. అమెరికా జాతీయ భద్రతపై ఆందోళనలు.. వెరసి ప్రపంచ చిప్‌ దిగ్గజం ఎన్వీడియాలో పెను ప్రకంపనలు! కంపెనీ సారథి జెన్సన్‌ హువాంగ్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. కేవలం 11 రోజులకే అదే కంపెనీ బోర్డు ఆయనను తిరిగి సీఈఓ పీఠంపై కూర్చోబెట్టింది. మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రంగంలోకి దిగారు. హువాంగ్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి ఆయన నాయకత్వం అవసరమని సమర్థించారు. మరోవైపు చైనాకు ఏఐ చిప్స్‌ సరఫరా, విదేశీ నిఘా అనుమానాలు, వ్యక్తిగత సంబంధాల వెనుక ఉన్న అసలు కథపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంతకీ హువాంగ్‌ తప్పు చేశారా? ఆయనను తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఎన్వీడియాకు ఎందుకొచ్చింది? ట్రంప్‌ మద్దతు వెనుక అమెరికా ప్రయోజనాలున్నాయా? వ్యక్తిగత బలహీనతలు ప్రపంచ టెక్నాలజీ సామ్రాజ్యాలను కుదిపేయగలవా? ఒక వ్యక్తి చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ ఆధిపత్యానికి పరీక్షగా మారింది!

 

#Nvidia #JensenHuang #NvidiaCEO #DonaldTrump #AIChips #ChinaChipSupply #ChinaEspionage #USNationalSecurity #SemiconductorIndustry #TechNews