Home AP టీచర్లకు అండగా ఉంటాం గురువుల జోలికొస్తే ఊరుకోం శాప్ ఘటనపై లోకేశ్‌ ఫైర్‌

టీచర్లకు అండగా ఉంటాం గురువుల జోలికొస్తే ఊరుకోం శాప్ ఘటనపై లోకేశ్‌ ఫైర్‌

విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులపై జరిగిన ఉద్రిక్తతపై మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. గురువులను సమాజం దైవంలా భావిస్తుందని, అలాంటి ఉపాధ్యాయులను గతంలో వైన్‌ షాపుల వద్ద కాపలా పెట్టిన జగన్‌ పాలనలో వారికి గౌరవం లభించిందని భావించడం భ్రమ అంటూ విమర్శించారు. స్పోర్ట్స్‌ కోటాలో నియమితులైన ఉపాధ్యాయులపై అవకతవకల పేరుతో తప్పుడు ఆరోపణలు చేయడం వారి ప్రతిష్ఠను దెబ్బతీయడమేనని అన్నారు.

స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నిరసన

స్పోర్ట్స్‌ కోటా ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు తమపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు, తమకు న్యాయం చేయాలంటూ శాప్‌ అధికారులను కలిసిన సమయంలో వైసీపీ నేతలు కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. నియామకాల్లో అక్రమాలు జరిగాయని, కొందరు అభ్యర్థుల క్రీడా ధ్రువపత్రాలపై సందేహాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తూ సీబీఐ విచారణ కోరింది. దీనికి ప్రతిగా టీచర్లు తమ సర్టిఫికెట్లు, క్రీడా పతకాలు అసలైనవేనని చెబుతూ అధికారులకు ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని తెలిపారు. శాప్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడికి ప్రయత్నించారని లోకేశ్‌ ఆరోపించారు. రాడ్లు, కర్రలతో గురువులపై దాడికి దిగిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల వ్యవహారాల్లో వైసీపీ జోక్యం చేసుకోవడం మానుకోవాలన్నారు.

 

#NaraLokesh #MegaDSC #DSC2025 #SportsQuota #SportsQuotaTeachers #APDSC #SAAP #Vijayawada #TeacherRecruitment #DSCRecruitment #YSRCP #SportsCertificates #APEducation #AndhraPradesh #APNews