Home AP జగన్ 2.O… మరోసారి పాదయాత్ర

జగన్ 2.O… మరోసారి పాదయాత్ర


ఎన్నికల్లో మనదే విజయమన్న జగన్

రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల సమవేశంలో జగన్ పాదయాత్రపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. మరో ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలని జగన్‌ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు ఏ వర్గం కూడా సంతృప్తిగా లేరని జగన్‌ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై రెండేళ్లలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అన్నారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీపై ప్రజాదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల తమ పాలనను ప్రస్తుత కూటమి పాలనతో ప్రజలు పోల్చి చూస్తున్నారని జగన్‌ తెలిపారు.

 

#JaganMohanReddy #YSJagan #YSRCP #APLocalElections #LocalBodyElections #AndhraPradeshPolitics #JaganStrategy #YSRCPPolitics #ChandrababuNaidu #AllianceGovernment #APPolitics #RajahmundryPolitics #PoliticalNews #AndhraPradesh #YSRCPNews #JaganNews