Home AP ప్రశ్నించడం నేరమా? నిరసన తెలిపితే కేసులా?

ప్రశ్నించడం నేరమా? నిరసన తెలిపితే కేసులా?

కూటమిపై జగన్ ఆగ్రహం .

కాకినాడలో మెగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేసిన నిరుద్యోగ యువతపై కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే యువతపై కేసులు పెట్టడం దారుణమని ఆయన ఎక్స్‌ వేదికగా విమర్శించారు. కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన శ్యామ్‌, టీ. రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేశ్‌తో పాటు మరో 20 మంది పోలీస్‌ ఉద్యోగ ఆశావహులపై కేసులు నమోదు చేశారని జగన్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చినా అవి అమలు కాలేదని ఆరోపించారు.

నిరుద్యోగ భృతి ఇంకెప్పుడిస్తారు?

రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటే, ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్ల మేర బకాయి అవుతుందని జగన్‌ తెలిపారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీ వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా అణచివేతకు పాల్పడుతోందని జగన్‌ విమర్శించారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ కల్పిస్తూ, ఉద్యోగ నోటిఫికేషన్లు కోరుతున్న నిరుద్యోగులను నేరస్తుల్లా చూడటం అన్యాయమన్నారు. యువత సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం నిరసనలకు కేసులతో సమాధానం ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కాకినాడలో నిరసన తెలిపిన యువతపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. మెగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

 

#YSJagan #JaganMohanReddy #Jagan #YSRCP #UnemployedYouth #YouthProtest #KakinadaProtest #Kakinada #PoliceRecruitment #MegaPoliceRecruitment #PoliceJobs #JobCalendar #UnemploymentAllowance #APJobs #AndhraPradeshJobs #ChandrababuNaidu #CoalitionGovernment #MegaDSC #DSCControversy #YSRCPProtest #YouthJobs #APPolitics #AndhraPradeshPolitics #JaganNews