Home National_news క్షమాపణలేనా.. కేసుల సంగతేంటి? అభిజిత్ దీప్కే ప్రశ్నల వర్షం

క్షమాపణలేనా.. కేసుల సంగతేంటి? అభిజిత్ దీప్కే ప్రశ్నల వర్షం



ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రశ్నలు లేవనెత్తారు. “రీల్‌లో క్షమిస్తున్నారా… లేక విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరిస్తారా?” అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. క్షమాపణల ప్రకటనతో పాటు విద్యార్థులపై తీసుకున్న చర్యలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిరసనల తర్వాత కొత్త చర్చ

ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో కొందరు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ప్రధాని ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తనను, తన తల్లిని దూషించిన వారిని క్షమిస్తున్నానని చెప్పారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాతే అభిజిత్ దీప్కే స్పందిస్తూ కేసుల ఉపసంహరణపై ప్రశ్నలు సంధించారు.

రెండు రకాల చట్టాలా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఓ కెమెరామెన్‌పై అనుచిత పదజాలం ఉపయోగించిన ఘటనను కూడా అభిజిత్ దీప్కే ప్రస్తావించారు. “ఈ దేశంలో యువతకు ఒక చట్టం… అధికార పార్టీ నేతలకు మరో చట్టమా?” అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో నోయిడాకు చెందిన ఓ బాలికపై కేసు నమోదైంది. తాజాగా ఆమె వీడియో విడుదల చేసి ప్రధానికి, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. అయితే నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తివేస్తుందా లేదా అన్న అంశంపై ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చ కొనసాగుతోంది.

 

#AbhijitDipke #PMModi #NarendraModi #StudentProtests #StudentCases #JantarMantar #CockroachJanataParty #YouthProtests #StudentProtestCases #CasesWithdrawal #PoliticalNews #IndianPolitics #PMModiInstagram #YouthVoices #AbhijitDipkeNews #DelhiProtests #StudentRights #FreedomOfSpeech