Home Telangana ఎర్రవల్లి భూములపై సర్వే షురూ

ఎర్రవల్లి భూములపై సర్వే షురూ

కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ లెక్కలు.
పాత రికార్డులు.. క్షేత్రస్థాయి పరిశీలన.

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టుపక్కల భూములపై రెవెన్యూ సర్వే ప్రారంభమైంది. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనల నేపథ్యంలో మార్కుక్ మండల రెవెన్యూ అధికారులు పాత భూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సర్వే పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు.

350 ఎకరాలపై ఆరోపణలు.. నివేదికకు రంగం సిద్ధం

అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 350 ఎకరాలకు పైగా భూముల రికార్డులు మార్చినట్లు ఆరోపించారు. ప్రభుత్వ భూముల వివరాలను నిర్ధారించేందుకు సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు రికార్డులు, భూముల వివరాలను సరిపోల్చుతున్నారు. తదుపరి దశలో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి ఫామ్‌హౌస్ భూములకు సంబంధించిన పత్రాలు కోరే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ సమర్పించే పత్రాలను అధికారిక రికార్డులతో పోల్చి రెవెన్యూ శాఖ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. సర్వే సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని భావిస్తే న్యాయపరమైన మార్గాన్ని ఆశ్రయించేందుకు న్యాయవాదులు సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

#ErravelliLandSurvey #KCRFarmhouse #KCR #RevanthReddy #Erravelli #Siddipet #Markook #TelanganaLandSurvey #LandRecords #GovernmentLand #RevenueSurvey #KCRLandIssue #TelanganaPolitics #TelanganaNews