Home Telangana ఆ భూములు మావే ఎర్రవల్లి భూములపై రైతులు

ఆ భూములు మావే ఎర్రవల్లి భూములపై రైతులు

సర్వే అడ్డుకున్న దళితులు.

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు సమీపంలోని భూముల్లో రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను స్థానిక రైతులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 325లో 388 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, దాని హద్దులు గుర్తించేందుకు కలెక్టర్ ఆదేశాలతో వచ్చామని అధికారులు చెప్పినట్లు రైతులు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు సర్వే జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ ప్రకటనల తర్వాతే సర్వే ఎందుకు మొదలైందో తమకు అనుమానం కలుగుతోందని రైతులు నిలదీశారు.

భూములు లాక్కుంటే ఎలా

సర్వే నంబర్ 325లో 300కుపైగా దళిత కుటుంబాలు తరతరాలుగా సాగు చేసుకుంటున్నాయని రైతు మల్లేష్ తెలిపారు. గతంలో భూముల్లో పెద్ద బండరాళ్లు ఉండటంతో సాగు కష్టంగా ఉండేదని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బండరాళ్లు తొలగించడం, చెరువుల మరమ్మతులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుతో సాగు సులభమైందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ వరి సాగు చేస్తున్నామని తెలిపారు. “రాజకీయాల కోసం మా భూములు తీసుకుంటే మా కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలి? ప్రాణం పోయినా భూములు ఇవ్వం” అంటూ మల్లేష్ స్పష్టం చేశారు.

 

#ErravelliLandSurvey #ErravelliFarmers #KCRFarmhouse #KCR #TelanganaFarmers #DalitFarmers #SurveyNumber325 #LandDispute #GovernmentLand #RevenueSurvey #Siddipet #Erravelli #TelanganaPolitics #FarmersProtest #TelanganaNews