ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విశాఖ సీఐఐ సదస్సులో వెల్లడించారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో రాష్ట్ర సముద్ర రంగ ప్రణాళికలను వివరించారు. 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం రాష్ట్రానికి ప్రధాన బలమని, పోర్టుల అభివృద్ధితో రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చిలోపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీటితో కార్గో సామర్థ్యం 195 నుంచి 286 ఎంఎంటీపీఏకు పెరుగుతుందని చెప్పారు. దుగ్గరాజపట్నంలో రూ.29 వేల కోట్లతో మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ప్రతిపాదించామన్నారు. మత్స్యకార మౌలిక సదుపాయాలకు రూ.690 కోట్లు కేటాయించామని, 2047 నాటికి ఏపీ కీలక సముద్ర వాణిజ్య కేంద్రంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
#AndhraPradesh #MaritimeHub #APPorts #PortDevelopment #BCJanardhanReddy #SarbanandaSonowal #CIIpartnershipSummit #RamayapatnamPort #MachilipatnamPort #MulapetaPort #ShipbuildingCluster #InvestInAP











