Home Telangana యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు… ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్

యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు… ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్

AIYF State Conference in Yadagirigutta

ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో: యాదగిరిగుట్టలో సెప్టెంబర్ నెల 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్, కార్యదర్శి ఎంబీ కుతుబ్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, లేకపోతే నెలకు రూ.5 వేల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. యువత సమస్యలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, విష్ణు, చందు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.